మెయిన్ ఫీచర్

అంతా ప్రేమ మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ.. ఓ మధర జ్ఞాపకం. ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు... ప్రేమికులు ఒకరినొకరు ఇంప్రెస్ చేసేందుకు మదనపడుతుంటారు. ప్రత్యేకించి ప్రేమికురాలి / ప్రేమికుడు మనసును దోచుకునేందుకు ఎలాంటి కానుక ఇవ్వాలో తేల్చుకోలేక ప్రేమికుడు / ప్రేమికురాలు తెగ తికమకపడిపోతుంటారు. బహుమతుల విషయంలో పట్టింపులు, ప్రత్యేక అభిరుచులు ఉండే అమ్మాయిల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఒక విశిష్ట రీతిలో తమ అభిమానాన్ని, ప్రేమను వ్యక్తం చేయడం నిజంగా ఓ సవాలు వంటిదే. ప్రేమ.. రెండక్షరాలే కాని అణుబాంబు కంటే బలమైనది. బుల్లెట్‌కంటే కూడా శక్తివంతమైనది. ప్రేమకోసం యుద్ధాలు జరిగాయి. ప్రేమకోసం ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎందరో. ఇక కొంతమంది తమ ప్రేమ భూమి ఉన్నంతకాలం గుర్తుండిపోవడం కోసం అద్భుతమైన కట్టడాలు నిర్మించారు.
మనం దిగుమతి చేసుకుంటున్న సాంప్రదాయాల్లో ‘ప్రేమికుల రోజు’ ముఖ్యమైనదిగా యువత మస్తిష్కాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంది. ఓ వైపు సంప్రదాయవాదులు ఇది సరికాదని హెచ్చరిస్తున్నప్పటికీ.. ప్రేమికులు, ప్రేమికుల రోజుకు మద్దతిస్తున్నవారు ఉత్సాహంగా వేడుకులు జరుపుతున్నారు. ప్రేమపక్షులు క్షణమొక యుగంగా గడిపే ఈ రోజు కోసం వారు నిరీక్షిస్తుంటారు. ప్రేమికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకున్న వ్యాపార సంస్థలు, వెబ్‌సైట్‌లు సరికొత్త తరహాలో వారిని ఆకర్షిస్తున్నాయి. గత కొంతకాలంగా పెరిగిపోతున్న ఇంటర్నెట్ ప్రేమాయణాలకు అదే ఇంటర్నెట్‌లో అందమైన కానుకలు కూడా అందుతున్నాయి. 1847లో ఈస్టర్ హాలెండ్ అనే మహిళ మసాచూసెట్‌లో వాలెంటైన్ కార్డుల తయారీకి నాంది పలికారు. అయితే ఈ వాలెంటైన్ కార్డులు అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. యుఎస్ గ్రీటింగ్ కార్డుల సంఘం అంచనా ప్రకారం ఒక్క ప్రేమికుల రోజునే ఏకంగా ఒక బిలియన్ కార్డులు ఇవ్వబడతాయని తెలిపింది. పూలు, చాకెలెట్లు, అందమైన బొమ్మలు ఇవ్వడం అంతా పాత ట్రెండ్. ప్రేమికురాలికి ఆనందాన్ని కలిగించే అందాన్ని బహుమతిగా అందిస్తున్నారు. లోపాలను సవరిస్తూ సౌందర్యాన్ని పెంచే ఫిల్లర్స్, బొటాక్స్ లాంటి సౌందర్య చికిత్సలను బహుమతిగా ఇవ్వడం ఇప్పటి వాలెంటైన్స్‌డే ట్రెండ్‌గా మారింది. ఏదేమైనా ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదని ఆత్రేయగారన్నది నూటికి నూరుపాళ్ళు నిజం.
ప్రేమికుల రోజు కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ సైట్లు అద్భుతమైన ఆఫర్లను వెల్లువలా ప్రకటిస్తాయి. కొందరు సరదాగా విహరిస్తారు. మరికొందరు ఎటైనా పర్యాటక ప్రదేశానికి వెళతారు. కొందరు పార్టీలకు, పబ్‌లకు, వేడుకలకు సమాయత్తం అవుతారు. ప్రేమని వ్యక్తపరిచే బహుమానం అతి విలువైనది, లేదా అతి తక్కువ ధరది ఐనా పర్లేదు- ఎదుటివారి మనసు దోచేస్తే చాలు.. అలాంటి కొన్ని కళారూపాలు!

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి