పర్యాటకం

నిగ్రహానుగ్రహ సమర్థుడు ఘృష్ణేశ్వరస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తవశంకరునిగా, భోళాశంకరునిగా అపార కృపాంబోనిధిగా, కరుణావత్సలుడు కీర్తిగాంచిన కైలాసవాసుడు పరమశివుడు. శివపూజచేయాలంటే పూర్వజన్మ పుణ్యం ఉండాలి. దానికి శివానుగ్రహంఉండాలి. భక్తితో రెండు చుక్కలు నీరుపోస్తే మహాదేవుడైన ఆ స్వామిమనలను కాపాడుతాడు. తెలిసి చేసినా తెలియక చేసినా శివుడు పొంగిపోయ తన భక్తులను కాపాడడానికి పరుగెత్తుకు వస్తాఢు. అందుకే స్వామిని మానవులు, రాక్షసులు, దేవతలే కాదు పశువులు కూడా పశుపతి కరుణ కోసం అర్రులు చాస్తాయని మన పురాణాలు చెబుతున్నాయ.
శివునిమీద లేశం అంత భక్తి ఉంటే చాలు ఆయన సముద్రమంత కృపను వర్షిస్తాడు. శివునిగూర్చి ఎంతో మంది తపస్సు చేసి శివుని తమకిష్టమైన చోట స్వయంభూగా వెలయాలని కోరుకున్నారు. భక్తులకిష్టమైనట్లు స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు ప్రపంచమంతా ఉన్నాయ.
శివక్షేత్రాల్లో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ప్రముఖమైనవి. ఈ క్షేత్రాలలో శివుడు భక్తుల అభీష్టంమేరకు లోక కళ్యాణంకోసం కొలువయ్యాడు శివయ్య. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల మహిమ అపారం. ఆ మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలసిన పుణ్యధామం ‘వెరూల్’. మహారాష్టల్రోని ఔరంగాబాద్‌కు 35 కిలోమీటర్లు దూరంలో ఉందిది. శివుడు ఇక్కడ ఘృష్ణేశ్వరస్వామిగా పూజలందు కుంటాడిక్కడ. వెరూల్ దివ్యక్షేత్రంలోని శ్రీఘృష్ణేశ్వర స్వామి ఆలయం సుందరమైనది. మనోహరమైన కట్టడాలతో అలరారుతున్న ఈ ఆలయం చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యాలయాన్ని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. సాక్షాత్తు మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన వెరూల్ దివ్యక్షేత్రంలో పూర్వం నాగజాతి ఆదివాసులుండేవారు. ‘బాంబీ’ అంటే పాముల పుట్టలని అర్థం. పాముపుట్టలను మరాఠీలో ‘వారుళ్’అంటారు. వారుళే కాలక్రమంలో వెరూల్‌గా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది.
మరో కథనం ప్రకారం పూర్వకాలంలో ఈ క్షేత్రాన్ని ‘యెల’అనే రాజు పాలించేవాడు. అతని రాజధాని ‘యేలాపూర్’. ఆ యేలాపూర్ యేలూరుగా, వెరూల్‌గా పేర్గొంచింది. శ్రీ ఘృష్ణేశ్వరస్వామి ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయాన్ని జైజాబాయి, అహిల్యాదేవి హోల్కర్ తదితర భక్తులు పునర్నిర్మించారు. అలాగే ఈ ఆలయ గోపురానికి జయరామ్ భాటియా అనే భక్తుడు స్వర్ణరేకు తాపడంచేశాడు. అలాగే 24రాళ్ళ స్తంభాలతో సభామండపాన్ని కూడా చేయించాడు. అతి పురాతనమైన ఘృష్ణేశ్వరం మహిమాన్వితమైనది. శివుడు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది.
పూర్వం దేవ పర్వతంపై సుదేహ, సుధర్ముడనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. సుదేహకు సంతానం కల్గకపోవడంతో తన చెల్లెలు అయిన ధుశ్శను తన భర్తకిచ్చి వివాహంచేసింది. కొంతకాలానికి ధుశ్శ గర్భాన్ని ధరించి ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. కాని సుదేహకు ఆ పిల్లవాణ్ణి చూస్తే ఈర్ష్యాసుయలు పుట్టాయ. సుదేహ, తన చెల్లెలు ధుశ్శ కొడుకును చంపించి, చెరువులో పడవేయించింది. శివభక్తురాలైన ధుశ్శ తన కొడుకు మరణించినా చెక్కుచెదరకుండా శివార్చన చేసిందట. శివుడు అనుగ్రహించి ధుశ్శ కొడుకుకి పునర్జీవితం ప్రసాదించాడు. దీనికి కారణమైన సుదేహను శిక్షించబోతుంటే ధుశ్శ తన అక్క చేసిన పాపాన్ని క్షమించమని, లోకకళ్యాణం కోసం స్వామిని అక్కడ వెలవమని ప్రార్థించిందట. ధుశ్శ అభీష్టంమేరకు శివుడు అక్కడ ధుశమేశ కామధేయుడై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు.
మరో పురాణ గాథ కూడా ఉంది. ఒకరోజు శివుడు, పార్వతి కామ్యక వనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళంనుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది. పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యిందట. ఆ లింగంనుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణంకోసం అక్కడ ప్రతిష్టించిందట. ఆనాటినుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతిమాత ప్రతిష్టించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్తు ఏర్పడిందంటారు. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం విశాలమైనది. పూర్తిగా రాతి కట్టడం, ఆలయానికి ముందు భారీ ఆకారంలో ఉన్న రాతి నంది ఉంది. గర్భాలయానికి ముందు ఎడమవైపు భాగంలో విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. ఆలయ ప్రాంగణంలో పార్వతి మాత ఆలయం ఉంది. గర్భాలయంలో ఉన్న ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం సర్వపాప హరణం. ముక్తిదాయకం. నిత్యపూజలతో పాటుగా మాఘ, కార్తీక మాసాలలో ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.

- చోడిశెట్టి శ్రీనివాసరావు