కడప

ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప (కలెక్టరేట్), జనవరి 22: వాహనాలు నడిపే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ కెవి రమణ కోరారు. శుక్రవారం స్థానిక జడ్‌పి సమావేశ మందిరంలో 27వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాహన యజమానులు, డ్రైవర్లతో మాట్లాడుతూ జిల్లాలో శుక్రవారం నుండి 28వ తేదీ వరకు రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని , రోడ్డుప్రమాదాలను అరికట్టడానికి యువత, డ్రైవర్లు సహకరించాలన్నారు. కండీషన్ లేని వాహనాలను నడపరాదని, పూర్తి కండీషన్‌లో ఉంచుకునే బాధ్యత డ్రైవర్లదేనన్నారు. అలాగే వాహనం చోదకులు హెల్మెట్లు లేకుండా వాహనాలు నడపరాదని అన్నారు. యువత అతివేగంగా డ్రైవింగ్ చేయరాదని, వేగాన్ని నియంత్రిస్తే భద్రత ఉంటుందన్నారు. ప్రజల భదత్ర కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ప్రజలు కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. జిల్లాలో గత ఏడాది 1354 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 92 ఆర్టీసీ బస్సు ప్రమాదాలు, 236 లారీ ప్రమాదాలు సంభవించాయని అంటూ ప్రమాదాల నివారణకు డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలన్నారు. రోడ్లు, భవనాలశాఖ ద్వారా రోడ్ల భద్రతపై సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకు ముందు వారోత్సవాల కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశానికి ప్రాంతీయ రవాణాశాఖాధికారి అస్లాంబాష, ట్రాఫిక్ డిఎస్పీ భక్తవత్సలం, ఆర్ అండ్ బి ఇంజనీరు చంద్రశేఖర్, హెహికల్ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.