బిజినెస్

పరిశోధనలకు వీలుగా పారిశ్రామిక విధానం: మంత్రి జూపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: పారిశ్రామిక రంగం అభివృద్ధి, పరిశోధనలకూ వీలుగా తెలంగాణ పారిశ్రామిక విధా నం రూపొందిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఇక్కడ తెలంగాణ, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో ‘పాలిమర్ పరిశ్రమలో కొత్త అవకాశాలు’ అనే అంశంపై జరిగిన సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ దేశంలో ప్లాస్టిక్స్, పాలిమర్స్‌ను సాధారణ ప్రజలే కాకుండా పరిశ్రమలు పెద్దఎత్తున వినియోగిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 30 వేల ప్లాస్టిక్ పరిశ్రమలున్నాయని, వీటిలో 80 శాతం ఎంఎస్‌ఎంఇ యూనిట్లేనన్నారు. 2014లో ప్లాస్టిక్ పరిశ్రమ ఎగుమతులు రూ. 7,916 కోట్లు జరిగాయని, ప్లాస్టిక్ పరిశ్రమకు సమర్థవంతమైన నెట్‌వర్క్‌తో కూడిన గట్టి వేదికను తయారు చేయడమే ఈ సమావేశ లక్ష్యంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఎఫ్‌టిఎపిసిసిఐ అధ్యక్షుడు అనిల్ రెడ్డి వెన్నం మాట్లాడుతూ వృద్ధిపథంలో దూసుకెళ్తున్న పాలు, ఆయిల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూని ట్లు, విస్తరిస్తున్న ఫార్మా రంగం, ప్లాస్టిక్ పైప్‌ల తయారీ రంగం వల్ల మన ప్రాంతంలో పెద్ద ఎత్తున పాలిమర్, ప్లాస్టిక్ వినియోగం జరుగుతోందన్నారు.