బిజినెస్

రూ. 6 వేల కోట్లతో విద్యుత్ లైన్ల పటిష్ఠానికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు పంపిణీ లైన్ల వ్యవస్థను 6 వేల కోట్ల రూపాయలతో పటిష్ఠం చేయాలని, దీని నిమిత్తం ప్రణాళికను ఖరారు చేసినట్లు ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ ప్రకటించారు. అమరావతిలో కూడా విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టం చేస్తామని, భూగర్భ విద్యుత్ పంపిణీ లైన్లను నిర్మిస్తామన్నారు. శుక్రవారం ఆయన విద్యుత్ ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతూ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్లు, పంపిణీ, ఉప పంపిణీ వ్యవస్థను మెరుగు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి నాటికి పవన విద్యుత్ నుంచి విద్యుత్ సరఫరాకు లైన్లను నిర్మించే కార్యక్రమం పూర్తవుతుందని, విద్యుత్ పంపిణీ నష్టాలను 13.24 శాతం నుంచి 10.30 శాతానికి తగ్గించామన్నారు. దీనివల్ల 840 ఎంయు అంటే 363 కోట్ల రూపాయల విద్యుత్ ఆదా అయిందన్నారు. ట్రాన్స్‌కో, డిస్కాంలపై విద్యుత్ కొనుగోలు భారం కూడా తగ్గిందన్నారు. రాష్ట్రంలో సాంకేతిక లోపాలతో ఉన్న మీటర్లను తొలగిస్తున్నామని, వీటి స్థానంలో నాణ్యమైన మీటర్లను అమర్చుతున్నామన్నారు. కాగా, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కింద 3,150 మెగావాట్ల పవన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు 400 కెవి సబ్‌స్టేషన్లు మూడు, 220 కెవి సబ్‌స్టేషన్లు 8 నిర్మిస్తామన్నారు. 558 కి.మీ పొడువున 400 కెవి లైన్లు, 220 కెవి లైన్లు 571 కి.మీ పొడవున నిర్మిస్తున్నామన్నారు. రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే విధంగా మొదటి దశలో రూ. 2,095 కోట్లను ఖర్చుపెడుతున్నామని తెలిపారు. ఈ నిధులను ఆర్‌ఇసి సమకూర్చుతోందని చెప్పారు. కేంద్రప్రభుత్వం రూ. 515 కోట్ల నిధులను గ్రాంటుగా విడుదల చేస్తోందని, ఈ కారిడార్ నిర్మాణానికి జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యు రూ. 515 కోట్లను మంజూరు చేస్తుందని వివరించారు. ప్రతి జిల్లాలో ఎక్స్‌ట్రా హై వోల్టేజి సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. కేపిటల్ రీజియన్‌లో 400 కెవి రింగ్‌ను ఏర్పాటు చేస్తామని, ఏలూరు, చిలుకలూరిపేట, గుడివాడ, తుళ్లూరులో క్యాపిటల్ రీజనల్‌కు విద్యుత్ నిరాటంకంగా సరఫరా చేసేందుకు సబ్‌స్టేష్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో రాచగనే్నరు వద్ద 400 కెవి ఎస్‌ఎస్‌ను నెలకొల్పుతామని, రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లలో పిఎల్‌ఎఫ్‌ను 85 శాతం నుంచి 90 శాతానికి పెంచుతామన్నారు. విద్యుత్ రంగంలో ఉన్నత ప్రమాణాలను పాటించినందుకు ఏపి జెన్కో, ఏపి ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్ సోలార్ విద్యుత్ సంస్థ, ఏపిఎస్‌పిసిఎల్‌కు 9వ ఇఎన్‌ఇఆర్‌టిఐఏ నుంచి ఉత్తమ అవార్డులను పొందినట్లు ఈ సందర్భంగా విజయానంద్ చెప్పారు.