పాటల్లో స్పీడున్నోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘సుందరపాండ్యన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ‘స్పీడున్నోడు’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు వి.వి.వినాయక్ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు తమన్నా, రెజీనా, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ, శ్రీనివాస్ సినిమా పోస్టర్ విడుదలౌతుందంటే సంతోషపడేది వారి తల్లిదండ్రుల తరువాత తానేనన్నారు. సాయిలో ఎంతో మెచ్యూరిటీ వుందని, ‘అల్లుడు శీను’ చిత్రంలో అద్భుతంగా డాన్సులు చేశాడని, ఈ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడని అన్నారు. భీమనేని మంచి కమిట్‌మెంట్ వున్న దర్శకుడని, తమిళంలో సూపర్‌హిట్ అయిన ఎన్నో చిత్రాల్ని తెలుగులో కూడా ఘనవిజయాల్ని అందించిన వ్యక్తి అన్నారు. హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ, మంచి పేరు తెచ్చుకోవాలని అందరం కష్టపడి పనిచేశామని, రెండో సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సినిమా చేస్తున్నానన్నారు. ఇందులో స్పెషల్ సాంగ్ చేసిన తమన్నాకు థాంక్స్ అన్నారు. దర్శకుడు భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ, మూడు సంవత్సరాలుగా ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేశానని, తనతోపాటే మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ వున్నాడని, తాను చేసిన ‘సుస్వాగతం’, ‘సూర్యవంశం’, ‘శుభాకాంక్షలు’ తరువాత ఎక్కువ మనసుపెట్టి చేసిన సినిమా ఇదన్నారు. తచ్చితంగా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్నారు. తమన్నా మాట్లాడుతూ, ‘అల్లుడు శీను’ సినిమాలో శ్రీనివాస్ డ్యాన్స్‌లు చూసి ఎగ్జైట్ అయ్యానని, ఈ సినిమాలో కూడా అద్భుతంగా డాన్స్ చేశాడని. ముఖ్యంగా పెర్‌ఫార్మెన్స్ విషయంలో మరో స్టేజీకి వెళ్లాడన్నారు.