జాతీయ వార్తలు

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: దేశ ఎన్నికల్లో అంగబలం, అర్థబలం పెచ్చరిల్లిపోవడం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమాలు ప్రజాస్వామ్య స్ఫూర్తినే దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇప్పటివరకు డిజిటల్, సామాజిక మీడియా వేదికలకు దూరంగా ఉన్న యువ ఓటర్లకు చేరువకావాలని ఎన్నికల కమిషన్‌కు రాష్టప్రతి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రణబ్ ముఖర్జీ ‘ఓటర్లను ప్రభావితం చేయడానికి నల్లధనాన్ని, అంగబలాన్ని ఉపయోగించడం అన్నది ఎంతమాత్రం క్షమార్హం కాదు. ఈ ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుంది’ అని వెల్లడించారు. 1950 జనవరి 25న భారత ఎన్నికల కమిషన్ ఆవిర్భవించిన రోజు కాబట్టి ఏటేటా ఈ రోజును జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎన్నికల కమిషన్ స్వయంగా ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది. ఓటు హక్కు వినియోగానికి సబంధించి ఓటర్లను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయడమే ఈ ఉత్సవాల ధ్యేయం. ఇటీవలి కాలంలో అన్ని ఎన్నికల్లోనూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించేలా ఎన్నికల కమిషన్ చేపట్టిన చర్యలను రాష్టప్రతి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఓటు వేయడానికి అర్హమైన వయస్సు వచ్చిన వెంటనే నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేనా ఎన్నికల కమిషన్ చర్యలు తోడ్పడుతున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ గురించి సామాజిక మీడియా కారణంగా ఎంతో చైతన్యం వచ్చిందని, ఇప్పటికీ వీటికి దూరంగా ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ గురుతర రీతిలో చర్యలు చేపట్టిందని, ఓటు హక్కు వినియోగంలో నైతికత ప్రాధాన్యతను తెలియజేసిందని రాష్టప్రతి అన్నారు. ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన చైతన్యపూరిత ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌కు నిరుపమాన స్థానం ఉన్నదని అన్నారు. దేశ ఎన్నికల్లో 84 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అన్నది ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమన్నారు. భారత్‌లో ఎన్నికల నిర్వహణ కేవలం ప్రజాస్వామ్య ఉత్సవమే కాదని, దీన్ని చేపట్టడం అన్నది నిరుపమానమైన పాలనా ప్రక్రియేనని వెల్లడించారు. ఇంతటి బృహత్తర బాధ్యతను ఎన్నికల కమిషన్, దాని అధికారులు నిర్దుష్టంగా, నిష్పాక్షికంగా, నిర్భయంగా నిర్వర్తించడం శ్లాఘనీయమని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ, దేశంలో 85కోట్ల మంది నమోదు చేసుకున్న ఓటర్లున్నారని, తాజాగా కోటీ 85లక్షల మంది చేరారని వెల్లడించారు. ఇంతమంది ఓటర్లు ఒకే దేశంలో ఉండడం అన్నది కొన్ని ఖండాల జనాభాతో సమానమని అన్నారు.