తెలంగాణ

పిట్టకథలు.. పంచ్ డైలాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: పిట్టకథలు, పంచ్ డైలాగులతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈనెల 31తో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో ప్రధాన పక్షాలు ప్రచార ఉద్ధృతిని పెంచుతున్నాయి. లోకేశ్ ప్రచారంపై టిడిపి నేతలు ఆశలు పెట్టుకున్నా ఉప్పల్‌లో ఆయన ప్రచారం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక కెటిఆర్ తన తండ్రి కెసిఆర్ తరహాలో పిట్టకథలు, పంచ్ డైలాగులతో ప్రచారం సాగిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పంచ్ డైలాగులతో పాటు అభ్యంతరకరంగా మాట్లాడుతుండడంతో చివరకు మిత్ర పక్షాల నుంచే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తలసాని చిన్న దొంగ, మర్రి శశిధర్‌రెడ్డి పెద్ద దొంగ అంటూ రేవంత్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. వ్యక్తిగత దూషణలతో రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం వల్ల తమకు వచ్చే ఓట్లు కూడా రాకుండా పోతాయని బిజెపి నాయకులు చెబుతున్నారు. అమీర్‌పేటలో సోమవారం రేవంత్‌రెడ్డి ప్రచారానికి వస్తే బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు.
దాంతో రేవంత్‌రెడ్డి వెనక్కి వెళ్లిపోయారు. కెటిఆర్ రోడ్‌షోలో ఒక పిట్టకథను తప్పనిసరిగా చెబుతున్నారు. కొడుకు వ్యసనాలకు బానిసై చివరకు తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు. న్యాయస్థానంలో తల్లిదండ్రులు లేని అనాథను క్షమించమని కోరుతాడు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు ఆ కొడుకు మాదిరిగానే అడుగుతున్నారని కెటిఆర్ పిట్టకథ చెబుతున్నారు. ఇంతకాలం పాలించిన కాంగ్రెస్ నాయకులు చేసిందేమీ లేదు, కానీ అధికారం లేకుండా ఉన్నాం అధికారం ఇవ్వండి అని అడుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే ఇతర రాష్ట్రాల వారిని వెళ్లగొడతారని ప్రచారం చేశారు, ఈ 18 నెలల్లో కనీసం గిచ్చలేదు కూడా అని చమత్కరించారు.
మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రధానంగా పటాన్‌చెరు, రామచంద్రపురం ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు, టిడిపికి లీడర్ లేడు, టిఆర్‌ఎస్‌కు ఎదురు లేదు అంటూ ఆయన కార్యకర్తలను ఉత్సాహ పరుస్తున్నారు. ఇక ఎంఐఎం ప్రచారం సైతం ఇదే విధంగా పంచ్ డైలాగులతో సాగుతోంది. ఎంఐఎం గెలవకపోతే బీఫ్ తినే అవకాశం పోతుందని ప్రచారం చేస్తున్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో వివరించిన ఇంటింటికి తాగునీరు, డబుల్ బెడ్ రూమ్ వంటి ప్రధానమైన హామీలన్నీ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్నాయి. అదే సమయంలో టిఆర్‌ఎస్ హామీలు అమలు కావాలంటే ఐదు వందల ఏళ్లు పడుతుంది అని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.