జాతీయ వార్తలు

ప్రసిద్ధ నృత్య కళాకారిణి మృణాళిని సారాభాయ్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జనవరి 21: ప్రసిద్ధ శాస్ర్తియ నృత్య కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మృణాళిని సారాభాయ్ (97) గురువారం ఉదయం కన్నుమూశారు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాల పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ సతీమణే మృణాళిని. వయోభారంతో అస్వస్థతకు గురైన మృణాళిని బుధవారం నగరంలోని ఓ ఆసుప్రతిలో చేరారు. ఆసుపత్రిలోనే గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ‘మా తల్లి నాట్యరంగానికి శాశ్వతంగా దూరమయ్యారు. ఆమె లేరన్న విషయం తెలపడం మాకెంతో బాధగా ఉంది’ అని మృణాళిని కుమార్తె, ప్రముఖ నతృకళాకారిణి మల్లికా సారాభాయ్ తెలిపారు. ఈ మేరకు మల్లిక తన ఫేస్‌బుక్‌లో తల్లి మృతిచెందిన విషయాన్ని పోస్ట్ చేశారు. చెన్నైలోని స్వామినాథన్ కుటుంబంలో జన్మించిన మృణాళిని శాస్ర్తియ నృత్యాలైన భరతనాట్యం, కథాకళిలో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకున్నారు. ఆమెకు పద్మశ్రీ, పద్మభూషణ్ సహా పలు విశిష్ట పురస్కారాలు లభించాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌లో మృణాళిని విద్యాభ్యాసం చేశారు. 1942లో విక్రమ్ సారాభాయ్‌తో వివాహమైంది. సారాభాయ్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు కార్తికేయ సారాభాయ్ సెంటర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ (సిఇఇ) వ్యవస్థాపకుడు. కుమార్తె మల్లిక సారాభాయ్ సామాజిక కార్యకర్త, నృత్యకళాకారిణి.