అక్షర

అపురూపమైన నాయన లేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేఖల్లో నాయన
సంకలనకర్త: కీ.శే. గంటి శ్రీరామమూర్తి
పేజీలు: 135.. వెల: రు.80
ప్రతులకు: 1. ఠాగూర్ పబ్లిషింగ్ హౌస్,
కాచిగూడ, హైదరాబాద్
2. శ్రీమతి గంటి రమణి, బెంగుళూరు-76
చరవాణి- 09980936107, 09483163948

కావ్యకంఠ గణపతి ముని బహుముఖ ప్రజ్ఞాశాలి. మహాతపస్వి, కారణజన్ముడు, మంత్రద్రష్ట మాత్రమేకాదు గొప్ప సంఘ సంస్కర్త, దేశభక్తుడు కూడా. మహాపాసకుడు, మహోపన్యాసకుడూ, జాతీయవాది, సంఘసంస్కరణ ప్రియుడూ అయిన నాయన వంటి మహాత్ములు యుగానికొక్కరు పుడతారు.
ఒక మహనీయుని మరొక మహనీయుడు మాత్రమే గుర్తిస్తారంటారు. అది రమణ, గణపతుల విషయంలోను వర్తిస్తుంది. భగవాన్ రమణులను గుర్తించి లోకానికి పరిచయం చేసింది కావ్యకంఠ గణపతి ముని. ‘స్వామీ, మీరు భగవాన్ రమణు’లని గణపతి ముని అనగానే, అలాగే ‘నాయనా’ అని గణపతిమునికి నాయన అనే పేరును స్థిరపరిచారు భగవాన్ రమణులు. ఆయన గణపతులైతే ఈయన కుమారస్వామి. భక్తులకు వారిద్దరు ముఖ్యమే. భగవాన్‌కు నాయనంటే ఎంతో ప్రీతి. వారిద్దరి మధ్య జరిగిన శక్తి ప్రవాహ ఫలితమే నాయన వ్రాసిన ఉమాసహస్రం. దళితుల దైన్యాన్ని తొలగించడానికి, స్ర్తిల స్వాతంత్య్రాన్ని పరిరక్షించడానికి మాత్రమే కాదు, దేశంలో ధర్మం పేరుతో నానాటికీ పెరిగిపోతున్న అధర్మాన్ని మట్టుబెట్టడానికి, వర్ణబేధం నాశనం కావడానికి తనకు శక్తిని ప్రసాదించమని ఇంద్రాణీదేవిని తన ఏడువందల శ్లోకాలలో ప్రార్ధించారు నాయన.
భారతదేశంలో నాయన విస్తృతంగానే పర్యటించారు. ఆశ్చర్యం ఏమిటంటే, భగవాన్ రమణులు ఏనాడూ అరుణాచలం విడిచి ఎక్కడికీ వెళ్లలేదు. భక్తుల అభిప్రాయం ప్రకారం నాయన దేహమైతే, ఆ దేహంలోని ఆత్మ రమణులు. రమణులు తాము చేయాలనుకున్న కార్యాలను నాయన ద్వారా చేయించారనేది భక్తుల విశ్వాసం. 1931-32 ప్రాంతాల్లో భగవాన్‌ను విడిచి నాయన శిరసి, కుళువే, గోకర్ణం, భువనేశ్వర్ ఇలా అనేక ప్రదేశాల్లో పర్యటించారు. తపస్సు చేసారు. అలాంటి సందర్భాల్లో నాయన రమణులకు ఉత్తరాలు రాసారు. వీటికి 1978లో ఒక పుస్తక రూపం వచ్చింది. భక్తులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అదే ఉఔజఒఆళఒ యచి జదఆ అనే ఫుస్తకం. దీనికి కొన్ని మెరుగులు తోడై 2006లో మలి ముద్రణ వచ్చింది. (ఈ మలి ముద్రణకు కృషి చేసింది న్యూయార్కులోని కావ్యకంఠ ఫౌండేషన్). ఇందులో నాయన భగవాన్‌ను సంబోధించిన తీరును పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే, ప్రతీ ఉత్తరంలోను ఆయన భగవాన్‌ను భగవాన్ విశ్వగురో అనీ, భగవాన్ లోకాచార్య అనీ కారణగురో అనీ, మాయామానుష్య అనీ, భక్తవత్సలా అనీ-ఇలా ఒక ఉత్తరంలో వాడిన సంబోధన మరో ఉత్తరంలో లేదు. నాయన రమణులకు ఉత్తరాలు ఎక్కువగా సంస్కృతంలో రాసారు. వీటిని ఆనందాశ్రమ లేఖలు అని కూడా అంటుంటారు. మనబోటి వారికి ఆధ్యాత్మిక, తత్వ వివేచనము కలిగిస్తాయి ఆ ఉత్తరాలు. ఇవి గురుశిష్య సంబంధమైనవి. అదేవిధంగా నాయన వివిధ సమయాల్లో వారి కుటుంబ సభ్యులకూ ఉత్తరాలు రాసారు. ఇవన్నీ ఎక్కువగా తెలుగులోనే రాయడం గమనార్హం. వీటన్నిటినీ పోగుచేసి జాగ్రత్తచేసారు కొందరు. అప్పట్లో పలు కాపీలు రూపొందించే సౌకర్యం లేదు. నకలు ఎవరో ఒకరు రాయాల్సిందే. ఆ రకంగా నాయన శిష్యుడు కల్యాణరామన్ వాటన్నిటినీ ఒక పుస్తకంగా రాసుకుని మైలార్డ్స్ లెటర్స్ అని మురిసిపోయాడు. ప్రముఖ పాత్రికేయులు జి.కృష్ణగారు కూడా ఒక ప్రతిని తయారుచేసి తమతో ఉంచుకున్నారు. ఆ తరువాతి రోజుల్లో గంటి శ్రీరామ్మూర్తిగారికి కృష్ణగారు ఆ ప్రతులను అందించారు. వాటన్నింటినీ ఇలా పుస్తక రూపంలో నేడు మనం చూడగలుగుతున్నాం అంటే, దానికి గంటి శ్రీరామ్మూర్తిగారి సేకరణ మాత్రమే కాదు. రామ్మూర్తి సోదరులైన లక్ష్మీనరసింహమూర్తిగారూ కారణమే.
ఈ పాయసాన్నంలో అక్కడక్కడా అచ్చుతప్పులు కొంత బాధిస్తాయి. కానీ మనం సవరించుకోలేనంత తప్పులైతే కావు. 10వ పేజీలో నాయన ఉత్తరంతో వివిధ పేరాలు కలిసిపోయి తికమక కలుగుతుంది. 16వ పేజీలో ప్రచురితమైన ఉత్తరం కింద స్టోన్కీ అని వేసారు. ఇది అచ్చుపొరబాటా, లేక నాయన అలా వ్రాసారా తెలీదు. ఎందుకంటే మిగిలిన ఉత్తరాల్లో కింద నాయన అనే ఉంది. ఈ సంకలనానికి లేఖల్లో నాయన అనే పేరుకన్నా, నాయన లేఖలు అని ఉంటేనే బాగుండేదేమో. అంకితం పేజీలు ఆశీర్వాద శ్రీముఖం తర్వాత వచ్చి ఉండాలి. ఆ తర్వాత రెండు వ్యాసాలు చోటుచేసుకుని ఉండాలి. నాయనగారి ఛాయాచిత్రాలు మరికొన్ని చోటుచేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఏదేమైనా నాయన, రమణభక్తులకు ఇది అపురూపమైన ప్రచురణ.
అసలు భగవాన్ రమణులకు రాసిన ఉత్తరాలనూ, ఈ ఉత్తరాలను కలిపి ఒక సంకలనంగా తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. రాబోయే కాలంలో ఆ కొరత తీరుతుందని ఆశిద్దాం.

-వజఝల వేంకట రమణ