అంతర్జాతీయం

పాక్ అణ్వస్త్రాల మోహరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 21: ఒకవేళ భారత్ గనుక తమపై దాడి చేస్తే దాన్ని నిరోధించడానికి వీలుగా పాకిస్తాన్ 110 నుంచి 130 దాకా అణ్వస్త్రాలను మోహరించి ఉందని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఒక నివేదిక పేర్కొంది. అంతేకాదు పాక్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో భారత్ అణుదాడి నిరోధక చర్యలను తీసుకోవడం వల్ల దక్షిణాసియాలోని ఈ రెండు పొరుగు దేశాల మధ్య అణు యుద్ధం తలెత్తే ప్రమాదం మరింత ఎక్కువైందని కూడా ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ వద్ద 110-130 దాకా అణ్వస్త్రాలున్నాయి. ఇవి అంతకన్నా ఎక్కువే ఉండవచ్చు. అణ్వస్త్రాల తయారీకి అవసరమైన ఇంధనాన్ని తయారు చేయడం, అదనంగా దానికి సంబంధించిన ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇతర దేశాలనుంచి కొనుగోలు చేయడం ద్వారా మరిన్ని అణ్వస్త్రాలను పాక్ సమకూర్చుకుంటోందని కాంగ్రెసనల్ రిసెర్చ్ సర్వీస్ (సిఆర్‌ఎస్) తన తాజా నివేదికలో పేర్కొంది. పాక్ అణ్వస్త్రాలన్నీ కూడా భారత్ తనపై దాడి చేయకుండా నిరోధించే ప్రధానోద్దేశంతో సమకూర్చుకున్నవే. ఇదేకాకుండా కొత్త ఆయుధాలను అభివృద్ధి చేయడం, ఇతర దేశాలనుంచి కొనుగోలు చేయడం ద్వారా భారీ ఎత్తున అణ్వస్త్రాలను సమకూర్చుకుంటోంది. భారత్‌కూడా తన అణ్వస్త్రాల సామర్థ్యాన్ని పెంచుకుంటోందని, ఇదంతా చూస్తే ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం వచ్చే ప్రమాదం పెరుగుతోందని కొంతమంది పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేయడానికి దారితీస్తోందని 28 పేజిల నివేదికలో సిఆర్‌ఎస్ తెలిపింది. సిఆర్‌ఎస్ అనేది అమెరికా కాంగ్రెస్‌కు చెందిన స్వతంత్ర పరిశోధనా విభాగం. అమెరికా పార్లమెంటు సభ్యులు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా అది వివిధ అంశాలపై ప్రముఖ నిపుణుల చేత ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందిస్తూ ఉంటుంది.
కాగా, తన అణ్వస్త్రాల భద్రతకు సంబంధించి ప్రపంచ దేశాల విశ్వాసం పెరగడానికి పాకిస్తాన్ ఇటీవలి సంవత్సరాల్లో అనేక చర్యలు తీసుకుందని పౌల్ కె కెర్, మేరీ బెత్ నికితిన్ రూపొందించిన సిఆర్‌ఎస్ నివేదిక తెలిపింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలపై కంట్రోళ్ల పట్ల అమెరికా, పాక్ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ దేశంలో అస్థిరత కొనసాగుతుండడం ఈ రక్షణలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదేకాకుండా భారత్, పాకిస్తాన్‌లు రెండూ కూడా తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉండడంతో ఈ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సుస్థిరతను దెబ్బతీసే ప్రమాదం కూడా ఆ నివేదిక అభిప్రాయపడింది.