చిత్తూరు

పర్యాటక నగరంగా తిరుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 5: తిరుపతి పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మిక, పర్యాటక నగరంగా తీర్చిదిద్దడాటిని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక రంగ కార్యదర్శి వినోద్‌జోషి తెలిపారు. శుక్రవారం గ్రాండ్‌రిజ్ హోటల్‌లో జిల్లాలోని పర్యాటక రంగం అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేనట్లుగా పర్యాటక విధానం ద్వారా తిరుపతి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెయ్యడానికి కృషిచేస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటకశాఖ అంటే ఆలయాలకు వెళ్లడమే అన్నట్లుగా సాగుతోందన్నారు. అలాకాకుండా పర్యాటకులను ఉత్సాహకపరిచేవిధంగా ఆయాప్రాంతాలను తీర్చిదిద్దడానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయన్నారు. తిరుపతికి ప్రధానాకర్షణ వెంకటేశ్వరస్వామి అన్నారు. ఈక్రమంలో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు రోజులపాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో బస చేసేవిధంగా ఈరంగంలో మార్పులు తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. గోదావరి, కృష్ణనదీ తీరాల్లో అద్భుతమైన ద్వీపాలు ఉన్నాయన్నారు. ఐదు, మూడు నక్షత్ర హోటళ్లు, రిసార్టులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, ఫుడ్‌కోర్టులు, జలసహస్త్ర క్రీడలను ప్రతి ప్రాంతంలోనూ ఏర్పాటుచేస్తామన్నారు. నూరునుండి రెండు వందల కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో మెగా కనె్వర్షన్ సెంటర్లు నిర్మిస్తున్నామన్నారు. జూలై నుండి పాకశాస్త్ర విశ్వవిద్యాలయంలో 32మంది విద్యార్థులతో డిగ్రీకోర్సును అభ్యసించేందుకు తరగతులు నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. రానున్న రెండు సంవత్సరాలలోపు రేణిగుంట మండలంలోని కుర్రకాలువలో పాకశాస్త్ర విశ్వవిద్యాలయ భవన నిర్మాణం పనులు వేగవంతం చెయ్యడానికి అధికారులను ఆదేశించామన్నారు. జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అనేక ఆలయాల్లో టూరిస్ట్ సర్క్యూట్ కేంద్రాలుగా అభివృద్ది చెయ్యడానికి చర్యలు చేపడుతున్నాం అన్నారు. ఈసమావేశంలో కేంద్ర టూరిజం సంయుక్త కార్యదర్శి ప్రీతిశ్రీవాస్తవి, రాష్ట్ర టూరిజం కమిషనర్ ఆర్‌పి కజరహా, వై. సత్యనారాయణ, రాజేష్, అరోరా తదితరులు పాల్గొన్నారు.
శోభాయమానంగా తిరుపతి అభివృద్ధికి
చర్యలు: టిటిడి ఇ ఒ
తిరుపతి, ఫిబ్రవరి 5: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పచ్చదనాన్ని పెంచి నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు టిటిడి పరిధిలోని రోడ్లను ఫిబ్రవరి కల్లా పూర్తి చేయనున్నట్లు ఇఒ డాక్టర్ సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన కార్పొరేషన్, తుడ, పోలీస్, అటవీశాఖ, ఇరిగేషన్, విద్యుత్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిని సుందర నగరంగా మార్చడంలో అనేక ప్రమాణాల గురించి ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వినయ్‌చంద్, అర్బన్ ఎస్పీ గోపినాద్‌జెట్టి, తుడ కార్యదర్శి మాధవీలత, సి ఐ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో పలు క్లబ్‌లపై పోలీసుల దాడులు
*65 మంది అరెస్టు, సుమారు 75వేల నగదు స్వాధీనం
*65 సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 5: అర్బన్ జిల్లా పరిధిలో ఎస్‌పి గోపీనాథ్‌జట్టి ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా విడిపోయి స్థానికంగా ఉన్న క్లబ్‌లపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈక్రమంలో అలిపిరి పరిధిలో ఉన్న లడ్డూ భాస్కర్‌కు చెందిన క్లబ్‌లో 44 మందిని అరెస్టుచేసి రూ. 42వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వెస్ట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న టౌన్‌క్లబ్‌పై దాడిచేసి 12 మందిని అరెస్టు చేసి రూ. 25,400 స్వాధీనం చేసుకున్న వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆఫీసర్స్ క్లబ్‌లో దాడిచేసి తొమ్మిది మందిని అరెస్టుచేసి రూ. 10,500, సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొంత మంది ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆకస్మికంగా పోలీసులు దాడులు చేయడంతో కొంత మంది క్లబ్‌లో ఉన్న వ్యక్తులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రహరీ గోడలు దూకి పారిపోయారు.
శ్రీవారి సన్నిధిలో దూషణలు
* సిబ్బందితీరుపై డయల్ యువర్ ఇఒలో భక్తులు ఫిర్యాదు
తిరుమల, ఫిబ్రవరి 5: శ్రీవారి సన్నిధిలో అక్కడ పనిచేసే ఉద్యోగులు భక్తులను దూషిస్తున్నారని, ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని సూళ్లూరుపేటకు చెందిన మురళీకృష్ణ ఆనే భక్తుడు డయల్ యువర్ ఇ ఒ కార్యక్రమంలో ఇ ఒకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం అన్నమయ్య భవనంలో డయల్ ఇ ఒ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆ భక్తుడు మాట్లాడుతూ ఇటీవల తాను సుప్రభాత సేవకు వెళ్లినప్పుడు ఆలయంలో ఉన్న సిబ్బంది తనపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీనిపై ఇఓ స్పందిస్తూ సిబ్బంది పేరు చెపితే తగు చర్య తీసుకుంటామన్నారు. అరగొండకు చెందిన హరీష్ అనే భక్తుడు మాట్లాడుతూ శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు పాదరక్షలు ధరించకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఇ ఒ మాట్లాడుతూ శ్రీవారి మెట్ల పవిత్రతను తెలియ చేస్తూ భక్తులకు సూచనలు చేశామన్నారు. హైదరాబాద్‌కు చెందిన సుబ్రహ్మణ్యశాస్ర్తీ అనే భక్తుడు మాట్లాడుతూ పరకామణి, లడ్డు ప్రసాద సేవకు వయో పరిమితి పెంచాలని, శ్రీవారి పుష్కరణిలో సంకల్పం చేసుకునేందుకు పురోహితులను ఏర్పాటు చేయాలని కోరారు. ఇ ఒ మాట్లాడుతూ శ్రీవారి పరకామణి, లడ్డు ప్రసాద సేవలకు 65 ఏళ్లలోపు వారిని అనుమతిస్తాన్నారు. ఉత్సాహంతులైన వారు లడ్డు కౌంటర్ సేవలో శ్రీవారి సేవకు నమోదు చేసుకోవచ్చన్నారు. కోటీశ్వర్‌రావు అనే భక్తుడు మాట్లాడుతూ అభిషేక సేవలో పాల్గొనే భక్తులకు స్వామివారి వస్త్రం ఇస్తే బాగుంటుందని కోరారు. మరో భక్తుడు మాట్లాడుతూ విష్ణు నివాసంలో 300రూపాయల క్యూలైన్లు భక్తులకు అదనంగా డబ్బులు తీసుకొని టికెట్లను అడ్డదారిలో తీసిస్తున్నారని ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంకు చెందిన రమణమూర్తి అనే భక్తుడు మాట్లాడుతూ తిరుమలలో ట్యాక్సీ ధరలు నిర్ణయించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వృద్ధులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, విశాఖపట్నంలో టిటిడి పంచాంగాలను అందుబాటులో ఉంచాలని కోరారు. ఇ ఒ మాట్లాడుతూ తిరుమలలో త్వరలోనే ట్యాక్సీలకు ధరలు నిర్ణయించి ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలలోరద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రెండు ఆర్టీసీ బస్సులను అదనంగా ఉచితంగా నడుపుతున్నామన్నారు. ఈనెలాఖరులో టిటిడి పంచాంగం విడుదల చేసి విశాఖపట్నంలో విక్రయానికి ఉంచుతామన్నారు. రంగారెడ్డిగూడెం సాయిబాబ్జీ అనే భక్తుడు మాట్లాడుతూ 18 ఏళ్ల వయస్సు కలిగిన మా అబ్బాయి పంచకట్టుకోవడం తెలియక శ్రీవారి దర్శనం చేసుకోలేకపోయాడని, మాడ వీధుల్లో కాళ్లు కాలిపోతున్నాయని, మా ఊరిలో ఉన్న కల్యాణ మండపాలను మరమ్మతులు చేపట్టాలని ఇ ఒను కోరారు. ఈఒ మాట్లాడుతూ ప్రత్యేక ప్రైవేటు దర్శనం, ఆర్జిత సేవలకు సాంప్రదాయ వస్తధ్రారణ పాటిస్తున్నామన్నారు. మాడ వీధుల్లో చలువ సున్నం వేసి తరచూ నీళ్లు చల్లుతున్నామన్నారు. కల్యాణ మండపాన్ని పరిశీలించి మరమ్మతులు చేపడుతామన్నారు. తిరుపతికి చెందిన విజయ అనే భక్తురాలు మాట్లాడుతూ తిరుచానూరులో క్యూలైన్ల పద్ధతి బాగాలేదని భక్తులు సమర్పిస్తున్న పూలు వృధా అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఇ ఒ మాట్లాడుతూ తిరుచానూరులో అరగంట లోపు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. భక్తులు తెచ్చే పూలను అమ్మవారికి అలంకరించే సాంప్రదాయం లేదన్నారు. తిరుపతికి చెందిన ప్రసాద్, కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వెళ్లేటప్పుడు అన్నప్రసాదం వృథా అవుతుందని, కాంప్లెక్స్‌లో ఇస్తున్న బయోమెట్రిక్ యాక్సెస్ కార్డును కాంప్లెక్స్ వెలుపల ఇవ్చచ్చు కదా అని సూచించారు. ఇ ఒ మాట్లాడుతూ అన్న ప్రసాదం వృథా కాకుండా అరికడతామన్నారు. బయట ప్రాంతాల్లో బయోమెట్రిక్ యాక్సెస్ కార్డు ఇవ్వడాన్ని మరికొంత కాలం తరువాత పరిశీలిస్తామన్నారు. నర్సీపట్నంకు చెందిన శేషు అనే భక్తుడు మాట్లాడుతూ తనకు వీడియోగ్రఫీ ఎడిటింగ్ తెలుసని అవకాశం ఇస్తే ఉచితంగా సేవ చేస్తానని ఇ ఒను కోరాడు. ఇ ఒ మాట్లాడుతూ మీ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న ఆలయాల గురించి, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలను వీడియో తీసి పంపితే వాటిని అవసరాన్ని బట్టి భక్త్ఛినల్‌లో వినియోగించుకుంటామన్నారు. ఇ ఒ మాట్లాడుతూ ఈ విషయంపై పరిశీలిస్తామని సమాధానం ఇచ్చారు. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఇంటర్నెట్‌లో కోటా పెంచామన్నారు. ఇందులో భాగంగా మార్చి 1 నుండి 31వ తేది వరకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా శుక్రవారం ఉదయం 11గంటలకు 53,389టికెట్లను విడుదల చేశామన్నారు. ఇందులో సుప్రభాతం 46,232, అర్చన 140, తోమాల 140, విశేష పూజ 1500, అష్టకల పాదపద్మారాదన 80, నిజపాద దర్శనం 1500, కల్యాణోత్సవం 11,622, వసంతోత్సవం 11,180, బ్రహ్మోత్సవం 6,020, సహస్త్ర దీపాలంకరణ సేవ 11,875, ఊంజల్ సేవ 3,100 టికెట్లను అందుబాటులో ఉంచామన్నారు. జెఇఓ శ్రీనివాస రాజు మాట్లాడుతూ ఈనెల 14న తిరుమలలో జరిగే రథసప్తమి (సూర్యజయంతి) వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నామన్నారు. ఒకే రోజు 7 వాహనాలపైన స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. సివి ఎస్‌ఓ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ రథసప్తమిని పురస్కరించుకొని వాహనాలు ఊరేగింపుసమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా నాలుగు మాడ వీధులలోని 14 గేట్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామని, వీటిని పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశామన్నారు. ఆల్ ప్రాజెక్టు స్పెషలాఫీసర్ ఎన్.ముక్తేశ్వరరావుమాట్లాడుతూ రథసప్తమి పర్వదినాన సూర్యవాహనం ఊరేగింపుసమయంలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ బాల మందిర్ విద్యార్థులు ఆదిత్యహృదయం, సూర్యశతకాలను పఠిస్తూ వాహనం వెంట తిరుగుతారని ఆయన తెలిపారు. సుమారు 300 మంది విద్యార్థులకు సంస్కృతంలో శిక్షణ ఇచ్చామన్నారు. విద్యార్థులు కేవలం విద్యాపరంగానే కాకుండా సామాజిక, సాంప్రదాయాల పట్ల కూడా అవగాహన పెంచుకొని ఒక గొప్ప సమాజంలో భాగస్వామ్యం కావాలన్నదే తమ లక్ష్యం అన్నారు. టిటిడి ఛీప్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నారాయణగిరి ఉద్యానవనంలో టిటిడి నిర్మింపతలపెట్టిన మహామణి మండపాన్ని (వెయ్యికాళ్లమండపం) ఏడాదిలోపు పూర్తిచేస్తామన్నారు. ఈ మండపం భక్తులకు బహుళ ప్రయోజనాలు కల్పించేవిధంగా ఉంటుందన్నారు. టిటిడి పిఆర్వో డాక్టర్ రవి మాట్లాడుతూ ఎస్వీ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన పుస్తక మహోత్సవంలో టిటిడి పుస్తక విక్రయ కేంద్రంలో పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. ఇందులో స్వామివారికి సంబంధించిన సీడీలు కూడా ఏర్పాటుచేశామన్నారు.

గ్రామీణాభివృద్ధిలో పంచాయతీలే కీలకం
* డాక్టర్ కుతూహలమ్మ వెల్లడి
తిరుపతి, ఫిబ్రవరి 5: భారత దేశం అన్ని రంగాల్లో పురోగతి సాదించాలంటే గ్రామ సీమలు సమ్మిళిత అభివృద్ధిలో పయనించాలని అలా జరిగినప్పుడే దేశం అభివృద్ధి అవుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ అభిప్రాయపడ్డారు. అగ్రశ్రీ రాజీవ్‌గాందీ జాతీయ యోజన అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం షెడ్యూల కులాలు, షెడ్యూల కులాల పంచాయతీరాజ్ ప్రతినిధుల సామర్థ్య శిక్షణ శిళిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా షెడ్యూల కులాలు, షెడ్యూల తెగల ప్రతినిధులు భవిషత్తులో మంచి నాయకులుగా ఎదగాలంటే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న అగ్రశ్రీ సంస్థను ఆమె అభినందించారు. ఎంపి డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ఎస్సీ, ఎస్టీలకు సంపూర్ణంగా అందినప్పుడు దానికి సార్థకత చేకూరుతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ వి హరినాయుడు, అగ్రశ్రీ సంచాలకులు డి.సుందర్‌రామ్, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు అమరనాథనాయుడు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న సింగపూర్ మంత్రి
తిరుమల, ఫిబ్రవరి 5: సింగపూర్ దేశానికి చెందిన మంత్రి షణ్ముగం శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ శాఖామంత్రి నారాయణ, జె ఇ ఓ శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూలవిరాట్ సన్నిధిలో ఆలయ ప్రధానార్చకులు స్వామివారి వైభవాన్ని గురించి, ఆలయ చరిత్రను గురించి వివరించారు. ఈసందర్భంగా ఆయనకు శేష వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం రంగానాయకుల మండపంలో టిటిడి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. జెఇఓ శ్రీనివాసరాజు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇ ఓ రామారావు, పేష్కార్ శెల్వం, ఓ ఎస్ డి లక్ష్మీనారాయణ యాదవ్, పారపత్తేదార్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
అమరావతిలో వెంకన్న ఆలయం
నిర్మించమని టిటిడిని కోరాం
* మంత్రి నారాయణ
తిరుమల, ఫిబ్రవరి 5: నవ్యాంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కృష్ణానది ఒడ్డున తిరుమల వెంకన్న ఆలయాన్ని నిర్మించాలని టీటిడి యాజమాన్యాన్ని కోరడం జరిగిందన్నారు. శుక్రవారం నాడు ఆయన సింగపూర్ మంత్రితో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ టీటిడి ధర్మకర్త మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగిందన్నారు. అనంతవరం ఆలయాన్ని టీటిడిలో విలీనం చేసుకున్నందుకు టీటిడి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామన్నారు.
స్విమ్స్‌లో శాస్ర్తియ పద్ధతులతో
గుండె చికిత్స
తిరుపతి, ఫిబ్రవరి 5: స్విమ్స్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో గుండె వ్యాధులతో బాధపడుతున్న వారికి శస్త్ర చికిత్స లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ అనే శాస్ర్తియ పద్ధతిలో శస్త్ర చికిత్స అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాణదానం పథకం కింద ఎంపికైన 8మంది పేద రోగులకు ఇలాంటి పద్ధతిని వినియోగించినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ తెలిపారు.
సాంకేతిక అభివృద్ధితో భక్తులకు
మరిన్ని సేవలు: చదలవాడ
తిరుపతి, ఫిబ్రవరి 5: ఆద్మాత్మిక అభివృద్ధికి సాంకేతిక విప్లవ సహకారంతో భక్తులకు మరింత ఉన్నతమైన సేవలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు టీటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతి శే్వత భవనంలో శుక్రవారం టిటిడిలోని విభాగాధిపతులకు డిజిటల్ సిగ్నేచర్ అండ్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అనే అంశంపై ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయ పాలన, అంకుటిత దీక్షకు మారుపేరు టిటిడి ఉద్యోగులు అన్నారు. వీటికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే వీరిలోకార్యదక్షత మరింత వృద్ధి చెందుతుందన్నారు. అందులో భాగంగానే నేడు ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో శే్వత సంచాలకులు ఆంజనేయులు, హెచ్ ఆర్ డి చంద్రశేఖర్, సిడాక్ ప్రతినిధులు శరత్‌చంద్రబాబు, బిందుమాధవ్, హర్షప్రభ, అధికారులు పాల్గొన్నారు.

అప్పులబాధతో రైతు ఆత్మహత్య
మదనపల్లె, ఫిబ్రవరి 5: అప్పులబాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లె పంచాయతీ పురాండ్లపల్లెకు చెందిన హనుమంతప్ప కుమారుడు లక్ష్మన్న(52) తన రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుని భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెను పోషించుకునేవారు. గత ఏడాది కుమార్తెకు వివాహం చేశారు. కాగా కుమార్తె కుటుంబ కలహాల కారణంగా పుట్టింటికి వచ్చింది. పొలంపై బ్యాంకులోను, ప్రైవేట్‌గాను అప్పులు చేశాడు. భార్య, కుమారులు కలిసి కూలీపనులు వెళ్ళినా అప్పలు తీరకపోగా అప్పులవారి నుంచి ఒత్తిళ్ళు ఎక్కువైయ్యాయి. రబీలో వేసిన ఉలవపంట సైతం తక్కువ దిగుబడి రావడంతో అప్పులబాధ తాళలేక రైతు లక్ష్మన్న శుక్రవారం తన వ్యవసాయ పొలంవద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక రామసముద్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు దృవీకరించారు. అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
శ్రీసిటీలో డిష్ యాంటెన్నాల తయారీ కేంద్రానికి భూమి పూజ
వరదయ్యపాళ్యం, ఫిబ్రవరి 5: శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న న్యూక్లియస్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రైవేటు సంస్థ, డిష్ యాంటెన్నాల తయారీ కేంద్రానికి శుక్రవారం ఆ సంస్థ ఎండి రామన్ భూమి పూజచేసి ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈసదర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది ఎకరాల స్థలంలో 25కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. 45, 60 వంద సెంటిమీటర్ల అడ్డుకొలత గల డిష్ యాంటెన్నాలు తయారు చేస్తున్నామని ఈ సంస్థ ద్వారా సుమారు 200మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. శ్రీ సిటి ఎండి రవీంద్రచెన్నారెడ్డి మాట్లాడుతూ గత రెండు వారాలలో మూడు కంపెనీలకు భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశ ప్రధాన మంత్రి ప్రతిపాదించిన డిజిటల్ ఇండియా పథకం స్పూర్తితో శ్రీ సిటీలో అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ పరిశ్రమల సముదాయంలోకి అడుగు పెడుతున్న మరో కొత్త పరిశ్రమకు స్వాగతం పలుకుతున్నామని, 1997నుండి పనిచేస్తున్న న్యూక్లియస్ సంస్థ డిష్ యాంటెన్నాలను దేశంలో ఇప్పటి వరకు సుమారు 12మిలియన్ల డిష్ యాంటీనాలను మార్కెటింగ్ చేసిందని ఈసందర్భంగా ఆయన తెలిపారు.
టిడిపి నేతపై కేసు నమోదు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, ఫిబ్రవరి 5: చిత్తూరులోని దేవాదాయ శాఖా సహాయ కమిషనర్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డ టిడిపినేత మనోహర్ నాయుడుపై పోలీసులు కేసునమోదు చేశారు. గురువారం మనోహర్ నాయుడు అతని అనుచరులు ఎండోమెంట్ కార్యాలయానికి వెళ్లి తాను ఫోన్‌చేస్తే తీయలేదన్న నెపంతో సహాయ కమిషనర్ మల్లికార్జునరెడ్డిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడి కార్యాలయంలో కుర్చిలను చెల్లాచెదురుచేసి నానాహంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటపై జిల్లాలోని దేవాదాయ శాఖ ఉద్యోగులు, అర్చకులు స్పందించి శుక్రవారం జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వారు కలెక్టర్ సిదార్ధజైన్‌ను, ఎఎస్పీ అభిషేక్ మహంతిని కలిసి దాడికి పాల్నడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. అతనిపై చర్యలు తీసుకోకుంటే ఈనెల 10వ తేది నుంచి నిరసనలు చేస్తామని హెచ్చరించారు. చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్ల తెలిపారు.