తెలంగాణ

17న ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: వరంగల్ జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మల జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 17న సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు, వరంగల్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌లో ఉదయం 9.30కి బయలుదేరి, మధ్యాహ్నం 12.45 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.20కి వరంగల్ నుంచి బయలుదేరి, సాయంత్రం 4.30కి సికింద్రాబాద్ బయలు దేరుతుందని తెలిపింది. వౌలాలి, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయగిర్, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగాం, రఘునాథపల్లి, ఘన్‌పూర్, పెండ్యాల్, కాజిపేట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని తెలిపింది.