బిజినెస్

పరిశ్రమలకు నిరంతర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు ఎటువంటి కోతలు లేకుండా నిరాటంకంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ భారతీయ పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మణుగూరు, కొత్తగూడెం, దామరచర్లలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైందన్నారు. 1,080 మెగావాట్లతో మణుగూరు, 800 మెగావాట్లతో కొత్తగూడెం, 4,000 మెగావాట్లతో దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ ప్రాజెక్టులు వచ్చే రెండేళ్లలో పూర్తవుతాయన్నారు. కాగా, సింగరేణి సంస్థ 600 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వార్ధా-మహేశ్వరం విద్యుత్ పంపిణీ లైన్ నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. మరోవైపు వచ్చే రెండేళ్లలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తవుతుందని, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 14 వేల థర్మల్ విద్యుత్ కెపాసిటీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందన్నారు.