క్రీడాభూమి

పాక్ అంపైర్ రవూఫ్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 12: పాకిస్తాన్‌కు చెందిన కళంకిత అంపైర్ అసద్ రవూఫ్ (59)పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) వేటు వేసింది. అవినీతికి పాల్పడి క్రికెట్‌కు కళంకం తీసుకొచ్చాడన్న అభియోగాల్లో రవూఫ్ దోషిగా తేలడంతో అతనిపై బిసిసిఐ శుక్రవారం ఐదేళ్ల నిషేధం విధించింది. ఐసిసి (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ఎలైట్ ప్యానల్‌లో సభ్యుడిగా పలు టెస్టు మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన రవూఫ్ బుకీల నుంచి ఖరీదైన బహుమతులు పుచ్చుకోవడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ 2013 ఎడిషన్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు కాశాడన్న అభియోగాల్లో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రవూఫ్ భవితవ్యంపై నిర్ణయాన్ని అనేక వారాల పాటు వాయిదావేస్తూ వచ్చిన బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నేతృత్వంలోని కమిటీ ఎట్టకేలకు అతనిపై నిషేధం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ కమిటీలో జ్యోతిరాదిత్య సింథియా, నిరంజన్ షా సభ్యులుగా ఉన్నారు. రవూఫ్ అవినీతికి పాల్పడినట్లు గతంలో ఆరోపణలు రావడంతో ఐసిసి ఎలైట్ ప్యానల్ నుంచి అతడిని పాకిస్తాన్ ఉపసంహరించుకుంది. ‘అంపైరింగ్‌తో పాటు ఏ రూపంలోనూ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించకుండా, అలాగే భారత క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఎటుంవటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా అసద్ రవూఫ్‌పై ఐదేళ్ల పాటు నిషేధం విధించాం’ అని కమిటీ సమావేశానంతరం బిసిసిఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అవినీతికి పాల్పడి క్రికెట్ ప్రతిష్టను దిగజార్చినట్లు వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చేందుకు రవూఫ్ కమిటీ ఎదుట హాజరుకాలేదని, అయితే జనవరి 15వ తేదీన ప్రాథమిక వాంగ్మూలాలను, ఈ నెల 8వ తేదీన లిఖిత పూర్వక ప్రకటనను పంపి చేతులు దులుపుకున్నాడని బిసిసిఐ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరోపణలకు సంబంధించి ఎంక్వయిరీ కమిషనర్ సమర్పించిన నివేదికను, అలాగే నిందితుడు రవూఫ్ పంపిన లిఖిత పూర్వక ప్రకటనను ఈ కమిటీ పరిశీలించి బిసిసిఐ అవినీతి నిరోధక నిబంధనావళిలోని 2.2.2, 2.3.2, 2.3.3, 2.4.1 ఆర్టికల్స్ ప్రకారం అతను అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు దోషిగా నిర్ధారించింది.