రాష్ట్రీయం

పోలీసులకు పెను సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 14: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరను విజయవంతం చేయడంలో సవాల్‌గా తీసుకోవాలని డిజిపి అనురాగ్‌శర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారంనకు చేరుకున్న ఆయన భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా జరుగుతున్న మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. మేడారం సమ్మక్క - సారలమ్మ మహాజాతరను విజయవంతం చేయడంలో పోలీసులే కీలకపాత్ర పోషించాలన్నారు. జాతరకు కోట్లాదిగా భక్తులు హాజరు కానున్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. భద్రత విషయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పనిచేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర సందర్భంగా పోలీసు శాఖకు రూ.4.75 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. అమ్మవారి గద్దెల వద్ద తొక్కిసలాట జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే మేడారం జాతర బందోబస్తుకు 10 వేల మంది పోలీసు సిబ్బందిని నియమించామని, అందులో 50 మంది డిఎస్పీలు, 150 మంది సిఐలు, 200 మంది ఎస్సైలను, 9,600 మంది కానిస్టేబుళ్లను నియమించామన్నారు.