ఆంధ్రప్రదేశ్‌

అలా ఇస్తేనే ప్యాకేజీని అంగీకరిస్తాం : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రత్యేక హోదా కింద వచ్చే ప్రయోజనాలన్నింటిని కలిపి ఇస్తే- ప్యాకేజీని అంగీకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, సాధారణంగా వచ్చే నిధుల మధ్య ఉన్న 30 శాతం నిధుల గ్యాప్‌ను పూడ్చాలని చంద్రబాబు షరతు పెట్టారు. కొద్దిసేపటి క్రితం సీఎంతో జైట్లీ, వెంకయ్య, సుజనా మాట్లాడారు. విశాఖ రైల్వేజోన్, పోలవరం, రాజధానికి నిధులు, కడప స్టీల్ ఫ్యాక్టరీపై సీఎం చంద్రబాబు పట్టుబడుతున్నారు. అన్నీ ప్యాకేజీలో ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్పష్టమైన ప్రకటన వస్తే అంగీకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్రం అంగీకారం తెలిపితే చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు.