ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థులకు తప్పిన పడవ ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద స్కూలు విద్యార్థులతో వెళ్తున్న పడవకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంతకవిటి గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు నాగావళి ఆవలి ఒడ్డున ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నారు. శనివారం ఉదయం వారు బయలుదేరిన పడవకు నారాయణపురం ఆనకట్ట సమీపంలో దట్టంగా ఉన్న గుర్రపుడెక్క ఆకు అడ్డుపడింది. పడవ మునిగిపోయే ప్రమాదంలో పడింది. ఈ దశలో సరంగులు అప్రమత్తమై పడవను వెనక్కి తీసుకువచ్చారు.