జాతీయ వార్తలు

వేడుకగా పద్మ అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఇక్కడి రాష్టప్రతి భవన్‌లో మంగళవారం ఉదయం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పలువురు ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉప రాష్టప్రతి అన్సారీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. సినీ నటుడు రజనీకాంత్, పత్రికాధిపతి రామోజీరావు, వికె ఆత్రే, గిరిజాదేవి, శాంతా విశ్వనాథన్‌లకు పద్మవిభూషణ్ అవార్డులను అందజేశారు.

పద్మభూషణ్ అందుకున్నవారు:
* రవీంద్ర చంద్ర భార్గవ (ప్రజా వ్యవహారాలు) * ఇందూజైన్‌( పారిశ్రామిక రంగం)
* ఉదిత్‌ నారాయణ్‌(కళా రంగం) * హెచ్‌.కన్హయ్యాలాల్‌(కళా రంగం)
* సానియా మీర్జా(క్రీడా రంగం) * డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌(సాహిత్యం)
* స్వామి తేజోమయానంద(ఆధ్యాత్మిక రంగం) * రామ్‌ వి.సుతర్‌( కళలు, శిల్పకళ)
* ప్రొ.ఎన్‌.ఎస్‌. రామానుజ తాతాచార్య(సాహిత్యం)

పద్మశ్రీ అవార్డు అందుకున్నవారు:
* ఎస్‌.ఎస్‌.రాజమౌళి( కళా రంగం) * ప్రియాంక చోప్రా (కళా రంగం)
* డా.మన్నం గోపీచంద్‌(వైద్య రంగం) * సునీతా కృష్ణన్‌ ( సంఘ సేవ)
* ఎం.ఎం. వెంకటేశ్‌ కుమార్‌( కళా రంగం) * మమతా చంద్రాకర్‌(కళా రంగం)
* జైప్రకాశ్‌ లేఖివాల్‌(పెయింటింగ్‌) * బాలచంద్ర దత్తాత్రే మోందే(ఫొటోగ్రఫీ )
* రవీంద్ర నాజర్‌(విద్యా రంగం) * దాహ్యాభాయి శాస్త్రి(విద్యా రంగం)
* సోనూ ఘోష్‌(కళా రంగం) * కామేశ్వరం బ్రహ్మ(విద్యా రంగం)
* జవహర్‌లాల్‌ కౌల్‌(విద్యా రంగం) * డా.చంద్రశేఖర్‌ శేషాద్రి (వైద్య రంగం)
* డా. అనిల్‌ కుమారి మల్హోత్రా(వైద్య రంగం) * సుధీర్‌ వి. షా (వైద్య రంగం)
* సైమన్‌ ఓరాన్‌(పర్యావరణం) * రవీందర్‌కుమార్‌ సిన్హా (వన్యప్రాణ రక్షణ)
* డా.హెచ్‌.ఆర్‌. నాగేంద్ర(యోగా) * ఉజ్వల్‌ నికమ్‌ (ప్రజా వ్యవహారాలు)