జాతీయ వార్తలు

రజనీకి పద్మవిభూషణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. అత్యంత ఉన్నతమైన పౌర పురస్కారం ‘ భారత రత్న’ ను ఈ ఏడాది ఎవరికీ ప్రకటించలేదు. సినీనటుడు రజనీకాంత్, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, జమ్ము-కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్‌మోహన్, నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి, సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, పాత్రికేయ రంగంలో రామోజీరావుకు పద్మవిభూషణ్ ప్రకటించగా, మరణాంతరం ఈ అవార్డును పారిశ్రామికవేత్త దీరూభాయ్ అంబానీకి ప్రకటించారు. క్రీడాకారిణులు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డి, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, గాయకుడు ఉదిత్ నారాయణ్‌లకు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించారు. ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన దర్శకుడు రాజవౌళి, బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, నటుడు అజయ్ దేవ్‌గన్‌లను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేశారు.