అంతర్జాతీయం

ఉగ్రవాదానికి ఐదేళ్లలో 8,500 మంది బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్ సర్కారు వెల్లడి
ఇస్లామాబాద్, నవంబర్ 28: పాకిస్తాన్‌లో ఉగ్రవాదానికి గత ఐదేళ్లలో 8,500 మందికి పైగా పౌరులు, భద్రతా సిబ్బంది బలైపోయారని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పేర్కొంది. పాక్ పార్లమెంట్‌లో శుక్రవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా ఆ దేశ ఆంతరంగిక భద్రతా శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉగ్రవాదం వల్ల గత ఐదేళ్లలో 5,532 మంది పౌరులు మృతిచెందారని, మరో 10,195 మంది ప్రజలు గాయపడ్డారని, అలాగే భద్రతా సిబ్బందిలో 3,157 మంది ఉగ్రవాదానికి బలైపోగా, 5,988 మంది గాయపడ్డారని ఆ శాఖ వివరించింది. కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉన్న గిరిజన ప్రాంతాల్లోనే అత్యధిక ప్రాణనష్టం జరిగిందని, గత ఐదేళ్లలో ఈ ప్రాంతాల్లో 1,487 మంది భద్రతా సిబ్బంది, 1,470 మంది ప్రజలు మృతిచెందగా, మరో 2,224 మంది భద్రతా సిబ్బంది, 2,761 మంది ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. ఈ ఐదేళ్ల కాంలో మొత్తం 3,759 మంది తీవ్రవాదులు హతమయ్యారని పాక్ ఆంతరంగిక భద్రతా శాఖ తెలిపింది.