క్రీడాభూమి

వామప్ మ్యాచ్‌లో లంకపై పాకిస్తాన్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా మార్చి 14: టి-20 వరల్డ్ కప్‌లో మెయన్ గ్రూప్ మ్యాచ్‌లు మంగళవారం నుంచి ప్రారంభం కానుండగా, సోమవారం జరిగిన చివరి వామప్ మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్తాన్ 15 పరుగుల తేడాతో విజయం సా ధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. మహమ్మద్ హఫీజ్ 70 పరుగులతో అజేయంగా నిలిచి, పాక్‌ను ఆదుకున్నాడు. ఓ పెనర్ షార్జెల్ ఖాన్ 23 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో తిసర పెరెరా 21 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయ 142 ప రుగులు చేయగలిగింది. దినేష్ చండీమల్ 30, లాహిరు తిరామానే 41 పరుగులు చేసి నప్పటికీ,మిగతా వారు విఫలం కావడంతో లంకకు ఈ వామప్ మ్యాచ్‌లో పరాజయం తప్పలేదు.
కాగా, ముంబయ క్రికెట్ సంఘంతో జరి గిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 14 పరు గుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత బ్యాటిం గ్ చేసి,20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగు లు చేసిన ఇంగ్లాండ్ అనంతరం ముంబయ ని ఆరు వికెట్లకు 163 పరుగులకు పరిమితం చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో జో రూట్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.