అంతర్జాతీయం

పాక్‌ను కుదిపేసిన భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇళ్లలోంచి జనం పరుగులు 89 మందికి గాయాలు
ఉత్తర భారతం, అఫ్గాన్, తజకిస్థాన్‌లోనూ ప్రకంపనలు
ఇస్లామాబాద్, డిసెంబర్ 26: శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.9 పాయింట్ల తీవ్రతతో శక్తివంతమైన భూకంపం అఫ్గానిస్థాన్ సరిహద్దులను ఆనుకుని ఉన్న ప్రాంతాలతో పాటుగా పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాలను వణికించింది. ఈ భూకంపం కేంద్రం భూమిలోపల 196 కిలోమీటర్ల లోతులో ఉందని తజకిస్థాన్, భారత్‌లోని అనేక ప్రాంతాల్లో ఈ భూకంపం ప్రభావం కనిపించిందని భూకంపం విభాగం డైరెక్టర్ గులామ్ రసూల్ చెప్పారు. అయితే ఈ భూకంపంవల్ల ఎవరు కూడా మృతి చెందినట్లు వార్తలు రాలేదని పోలీసు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, భూకంపం తీవ్రతను 6.3 పాయింట్లుగా పేర్కొన్న అమెరికా జియలాజికల్ సర్వే, హిందూకుష్ పర్వత ప్రాంతంలోని అష్కషమ్ ప్రాంతం దీని కేంద్రమని తెలిపింది. కాగా, ఈ భూకంపం ప్రభావం ఖైబర్-్ఫక్తూన్‌క్వా రాష్ట్ర రాజధాని పెషావర్‌తో పాటుగా లాహోర్ ఫైసలాబాద్, ముల్తాన్, సియాల్‌కోట్, స్వాత్, దక్షిణ వజిరిస్థాన్ తదితర అనేక ప్రాంతాల్లో కనిపించింది. పెషావర్‌లో, స్వాత్, దిర్ లోయర్ తదితర జిల్లాల్లో కలిపి మొత్తం 89 మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది భయంతో ఇళ్లలోంచి బైటికి పరుగులు పెట్టే సమయంలో గాయపడిన వారే.
అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతం కేంద్రంగా ఓ మోస్తరు తీవ్రతతో కూడిన భూకంపం శనివారం తెల్లవారుజామున ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలను కుదిపేసింది. అయితే చివరి వార్తలందేవరకు కూడా ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదు. అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించడంతో గాఢనిద్రలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్లలోంచి బైటికి పరుగులు తీశారు. జమ్మూ, కాశ్మీర్‌లో కూడా భూప్రకంపనలు కనిపించాయి. భూమి కంపించడం మొదలు కాగానే కాశ్మీర్ ప్రాంతంలోని ప్రజలు భయంతో ఎముకలు కొరికే చలిలో సైతం ఇళ్లల్లోంచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇప్పటికిప్పుడు ఏదయినా ప్రాణ, ఆస్తినష్టం జరిగిందా అనే విషయాన్ని చెప్పలేమని, పూర్తి వివరాలు అందాక మాత్రమే ఏమయినా చెప్పగలమని జమ్మూ, కాశ్మీర్ వాతావరణ విభాగం అధికారి ఒకరు చెప్పారు. జమ్మూ ప్రాంతంలోని మిగతా జిల్లాలలో కూడా భూకంపం జనాన్ని భయకంపితులను చేసినట్లు వార్తలు వచ్చాయి. తమ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి జనం ఫోన్లు చేయడంతో మొబైల్ నెట్‌వర్క్‌లు జామ్ అయ్యాయి. సామాజిక నెట్‌వర్క్ సైట్లలో భూకంపానికి సంబంధించిన మెస్సేజిలు పోటెత్తాయి. ** భూకంపం తీవ్రతకు అఫ్గాన్‌లోని జలాలాబాద్‌లో కూలిన ఇల్లు **