అంతర్జాతీయం

పాక్‌లో బక్రీద్‌ ప్రార్థనల్లో పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: మంగళవారం బక్రీద్‌ నాడు పాక్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండగా షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకుని రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. శిఖాపూర్‌ జిల్లా ఖాన్‌పూర్‌ ప్రాంతంలో నలుగురు దుండగులు మసీదుపై దాడి చేశారు. ఓ దుండగుడు తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడగా మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇద్దరు పోలీసులు సహా 10 మంది గాయపడ్డారు.
మరో ప్రాంతంలో షియా మసీదును లక్ష్యంగా చేసుకుని ఇద్దరు దుండగులు దాడికి యత్నించారు. పోలీసులు మసీదు ప్రవేశం ద్వారం వద్ద తనిఖీలు చేస్తుండగా అందులోని ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు.ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.