అంతర్జాతీయం

దాడి చేస్తే ప్రతిదాడికి సిద్ధమే:ఇమ్రాన్‌ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పూల్వామా దాడి వెనుక పాక్ హస్తం లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టంచేశారు. ఈ ఘటన తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పాక్ పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసే భారత్ ఇంతవరకు ఎటువంటి ఆధారాలు చూపలేదని అన్నారు. పాక్‌ను నిందించటం సరికాదని అన్నారు. ఆధారాలు ఉంటే పాక్ విచారించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఒకవేళ భారత్ దాడి చేస్తే ప్రతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన అన్నారు. యుద్ధం ప్రారంభించటం మన చేతుల్లోనే ఉంటుంది. తరువాత దాని పరిణామాలు, అది ఎలా ముగుస్తుందో ఎవ్వరికీ తెలియదని అన్నారు. పూల్వామా దాడిపై మమ్మల్ని నిందించవద్దని అన్నారు.