అంతర్జాతీయం

పాక్‌లో ఆత్మాహుతి దాడి : 22 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్, డిసెంబర్ 29: వాయువ్య పాకిస్తాన్‌లో మంగళవారం మోటారు సైకిల్‌పై వచ్చిన ఒక తాలిబన్ మానవ బాంబు రద్దీగా ఉండే ఒక ప్రభుత్వ కార్యాలయ భవనం గేటును ఢీకొట్టి పేల్చేసుకోవడంతో కనీసం 22 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఖైబర్ ఫక్తూన్‌క్వా రాష్ట్రంలోని మర్దానా పట్టణంలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేసే నేషనల్ డేటా బేస్, రిజిస్ట్రేషన్ అథారిటీ (నాడ్రా) కార్యాలయం వద్ద ఈ శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు తాకిడికి భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమైనాయి. జనంతో క్రిక్కిరిసి ఉన్న సమయంలో సంభవించిన ఈ పేలుడులో 22 మంది మృతి చెందినట్లు అత్యవసర సహాయ అధికారి ఒకరు చెప్పారు. ఇది ఆత్మాహుతి దాడేనని మర్దాన్ డివిజన్ పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సరుూద్ వజీర్ ధ్రువీకరించారు. కాగా, ఈ పేలుడు తామేనని తెహ్రీక్-ఇ-తాలిబన్ చీలిక వర్గం అయిన జమాతుల్ అహర్ ప్రకటించుకున్నట్లు ‘డాన్’ పత్రిక తెలిపింది. గత ఏడాది వాఘా సరిహద్దు వద్ద జరిగిన పేలుడు కూడా తమ పనేనని ఆ ముఠా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
మోటారు సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా, గేటువద్ద కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు వెళ్లనివ్వకపోవడంతో అతను మోటారు సైకిల్‌తో గేటును ఢీకొట్టి పేల్చేసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. వారినందరినీ మర్దాన్ మెడికల్ కాంప్లెక్స్, పట్టణంలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు. భద్రతా సిబ్బంది పేలుడు జరిగిన మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టేసారు. సహాయ, భద్రతా అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్తాన్‌లోని మొత్తం జనాభాకు కొత్తగా రిజిస్ట్రేషన్ వ్యవస్థను రూపొందించే బాధ్యతను అప్పగించిన నార్డా కార్యాలయం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. (చిత్రం) పేలుడు జరిగిన ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్న పాక్ భద్రతా దళాలు