అంతర్జాతీయం

పాక్‌లో బాంబు పేలుడు:8 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో బాంబు పేలుడు సంభవించింది. పోలీసులే లక్ష్యంగా ఈ పేలుడు సంభవించటంతో ఎనిమిది మంది చనిపోయారు. లాహోర్‌లోని సూఫీ ప్రార్ధనామందిరం దాతా దర్బార్ వద్ద ఈ పేలుడు జరిగింది. దర్బార్ రెండో గేటుకు సమీపంలో పోలీసు వాహనాలు నిలిచి వున్నాయి. ఈ వాహనాల వద్ద పేలుడు జరగటంతో పోలీసులే లక్ష్యంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా 24మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 8మంది పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పంజాబ్ ఐజీ ఆరీఫ్ నవాజ్ తెలిపారు.