జాతీయ వార్తలు

వేదిక ఏదైనా పాక్‌ను ఎండగడతాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంలో వేదిక ఏదైనా పాక్‌ను ఎండగడతామని ఐరాసలో భారత శాశ్వత రాయబారి అక్బరుద్దీన్ షా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పాక్ అనవసర రాద్ధాంతానికి దిగుతుందని అన్నారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకువెళ్లినా వేదిక ఏదైనా పాక్ వైఖరిని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కులభూషణ్ విషయంలో ఐసేజీలో పాక్‌కు భంగపాటు కలిగిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పటికే వారు ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యారని అన్నారు ఐరాస భద్రతామండలిలో కశ్మీర్ అంశంపై రహస్యంగా సమావేశం అవ్వటం వల్ల భారత్‌కు అన్ని దేశాలు మద్దతుగా నిలిచినట్లు స్పష్టమైందని అన్నారు. కాగా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు పాకిస్తాన్ మంగళవారం స్పష్టం చేసిన నేపథ్యంలో పాక్ వైఖరిని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఏఆర్‌వై న్యూస్ టీవీకి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి సూత్రప్రాయంగా తెలియజేశారు. ఆర్టికల్ 370 రద్దు అంశంతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటుచేసే నిర్ణయాన్ని భారత్ ప్రకటించిన వెంటనే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకొన్నాయని ఖురేషి పేర్కొన్నారు.