జాతీయ వార్తలు

పాక్ తప్పుడు ఆరోపణలను సహించబోం:్భరత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యారిస్: అత్యున్నత వేదికలను రాజకీయం చేస్తూ పాక్ చేసే తప్పుడు ఆరోపణలను సహించబోమని భారత ప్రతినిధి అనన్య అగర్వాల్ స్పష్టం చేశారు. ప్యారిస్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) సదస్సులో పాక్ లేవనెత్తిన కశ్మీర్ అంశంపై భారత ప్రతినిధి అనన్య అగర్వాల్ ధీటైన సమాధానం చేప్పారు. ఉగ్రవాద సిద్ధాంతాలకు, తీవ్రవాదం వంటి భావజాలానికి ఆలవాలమైన పాకిస్థాన్ చీకటి కోణాలకు అడ్డాగా మారిందని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ వంటివారు హీరోలుగా అభివర్ణిస్తున్నారని ఎద్దేవాచేశారు. పాక్ అనుసరిస్తున్న విపరీత పోకడల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, అలాగే ఆ దేశంలో మైనార్టీలపై జరుగుతున్న దాడుల విషయాన్ని కూడా అనన్య సదస్సు ముందుంచారు. అత్యున్నతమైన యునస్కో వంటి వేదికలపై రాజకీయ అంశాలను తీసుకురావటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.