క్రీడాభూమి

పాక్ జట్టు వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 12: ఆల్‌రౌండర్, సీనియర్ ఆటగాడు షహీద్ అఫ్రిదీ నాయకత్వంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌ను ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టింది. ఈ జట్టులో 15 మంది క్రీడాకారులు, 12 మంది అధికారులు ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ, అనిశ్చితి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందారు. భద్రతా అంశాలపై అనుమానాలు ఉన్నాయంటూ కొంతసేపు, లిఖితపూర్వక హామీ కావలంటూ మరికొంత సేపు భీష్మించుకొని కాలయాపన చేసిన పాకిస్తాన్ సర్కారు చివరి నిమిషాల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటికే కరాచీలో ఆటగాళ్లందరినీ పిలిపించించి భారత్ పర్యటనకు సిద్ధంగా ఉంచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి ముద్ర పడిన వెంటనే ఆటగాళ్లను విమానం ఎక్కించారు. అబూదబీ మీదుగా పాక్ జట్టు శనివారం రాత్రి భారత్ చేరుకుంది.
ఆటపైనే దృష్టి: వకార్
భద్రతాపరమైన అనుమానాలు, ప్రభుత్వ అనుమతి వంటి అంశాలతో పర్యటన ఆలస్యమైనప్పటికీ, ఆటగాళ్లలో ఎవరూ వాటి గురించి పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి కేంద్రీకరించారని పాకిస్తాన్ హెడ్ కోచ్ వకార్ యూనిస్ ట్వీట్ చేశాడు. భారత్‌లో తమకు సాదర స్వాగతం లభిస్తుందని పేర్కొన్నాడు. జట్టులో ఉన్న చాలామంది ఆటగాళ్లకు, అధికారులకు ఈ విషయం తెలుసునని తెలిపాడు. భారత్‌తో 19న జరిగే మ్యాచ్ గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. భారత్ కంటే ముందు బంగ్లాదేశ్‌ను ఢీ కొనాల్సి ఉందని గుర్తుచేసిన అతను ఆ మ్యాచ్‌నికూడా చాలా కీలకమైనదిగా అభివర్ణించాడు. 2007లో జరిగిన మొదటి టి-20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరినప్పటికీ భారత్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్న పాకిస్తాన్ 2009లో యూనిస్ ఖాన్ నాయకత్వంలో విజేతగా నిలిచింది. కాగా, ఆటగాళ్లందరూ మరోసారి టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారని వకార్ అన్నాడు. తమ కల అసాధ్యమేమీ కాదన్నాడు. అద్భుత విజ యాలను సాధించే సత్తా పాక్‌కు ఉందని అత ను ధీమా వ్యక్తం చేశాడు. టైటిల్ సాధించి స త్తా చాటుతామని అన్నాడు.
పాకిస్తాన్ బృందంలో సభ్యులు వీరే
షహీద్ అఫ్రిదీ (కెప్టెన్), మహమ్మద్ హఫీజ్, షర్జీల్ ఖాన్, అహ్మద్ షెజాద్, ఉమర్ అక్మల్, ఖలీద్ లతీఫ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్, అన్వర్ అలీ, ఇమాద్ వసీం, మహమ్మద్ నవాజ్, వాహబ్ రియాజ్, మహమ్మద్ అమీర్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ సమీ. కోచ్: వకార్ యూనిస్.