నిజామాబాద్

పల్లెల్లో పట్నం అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, డిసెంబర్ 25: పచ్చని పంటలతో అలరాడే పల్లె సీమల్లోనూ ఆధునీకత చోటు చేసుకుంటుంది. అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చుకునేందుకు ప్రజలు కృషి చేస్తుంటే, క్రమంగా పల్లెల్లోనూ అధునాతమైన గృహాలు తయారవుతున్నాయి. ఒకప్పుడు పల్లెలంటే పెంకుటిళ్లు, వసారాలతో కూడిన భవంతులు, మట్టిరోడ్లు మాత్రమే దర్శనమిచ్చేవి. వేకువజామునే నిద్రలేచిన రైతులు వంటలు చేసుకుని, టిఫిన్ డబ్బాలతో పంట పొలాలకు నడిచి వెళ్లే దృశ్యాలే కనిపించేవి. పచ్చని వాతావరణం, నాగళ్లు పట్టిన రైతన్నలతో గ్రామాల్లోని పంటలు కనిపించేవి. గ్రామాల్లోని వీధి దీపాలు సైతం బల్బులకే పరిమితం అయ్యేవి. గ్రామ కూడళ్లలో సాయంత్రం వేళా ముచ్చటించుకునే గ్రామస్థులతో పల్లెలు రాత్రి 8గంటలకే నిద్రావస్థలోకి జారుకునేవి. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఒకనాటి రైతులకు చెందిన కుటుంబాలతో పాటు చాలామంది యువకులు విద్యార్జనపై దృష్టి సారించి పట్నంలోని ఆధునీక సౌకర్యాలను తమ ఇళ్లలో కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో క్రమంగా పల్లెలకు పట్నం అందాలు అద్దుతున్నాయి. పాత పెంకుటిండ్లను తొలగించి, వాటి స్థానంలో అధునాతన భవనాలను నిర్మించుకుంటున్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఏ గ్రామంలో చూసినా ఇలాంటి భవనాల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల కాలంలో తెరపైకి వచ్చిన డూప్లెక్స్ భవన నిర్మాణాలు కూడా పల్లెల్లో కనిపిస్తున్నాయి. అంకాపూర్, అంక్సాపూర్, తిమ్మాపూర్, ఏర్గట్ల ఇలాంటి డూప్లెక్స్ భవనాలు కనిపిస్తున్నాయి. ఒక సమయంలో అభివృద్ధి కార్యక్రమాలల్లో పాల్గొనేందుకు వచ్చిన అమాత్యులు వీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పల్లెల్లో కాకుండా పట్నాల్లో వీటిని నిర్మించుకుంటే బాగుంటుందని ఉచిత సలహా ఇస్తే, తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును తాము అనుభవించడమే లక్ష్యమని రైతులు ఆనాడే సూటిగా చెప్పేశారు. ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి రావడంతో పాటు రైతుల కుటుంబాలకు చెందిన చాలామంది యువకులు విదేశాల్లో స్థిరపడటం వల్ల కూడా ఆర్థిక పరిపుష్టి చేరుకుంది. కేవలం గృహ నిర్మాణాలకే పరిమితం కాకుండా ఇన్వర్టుర్లు, ఎల్‌ఇడి టీవిలు, ఎయిర్ కండిషనర్లతో పాటు ప్రతి కుటుంబం కార్లను సైతం అందుబాటులోకి తెచ్చుకుంద. దీంతో గ్రామాల్లో ఎటు చూసినా, అధిక సంఖ్యలో కార్లు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మట్టిరోడ్ల స్థానంలో సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేసింది. బల్బుల స్థానంలో ఎలోజిన్ ల్యాంప్‌లు, చౌరస్తాలో సోడియం వెలుగులు కొత్త అందాన్ని తెస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ విశాలమైన ఆవరణలో ఆలయాలను నిర్మించుకుంటూ భక్త్భివాన్ని కూడా పెంపొందించుకుంటున్నారు. ఇంతేకాకుండా పంట పొలాలకు వెళ్లే మహిళా రైతులు సైతం స్కూటీ లాంటి ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నారు. పంట పొలాల్లోనూ ఇలాంటి వాహనాలు దర్శనమిస్తున్నాయి. తాము పడిన కష్టం తమ పిల్లలు పడకూడదనే లక్ష్యంతోనే అన్ని సౌకర్యాలను కల్పిస్తూ, ఖర్చు పెరిగినప్పటికీ వారిని ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు సైతం పంపిస్తున్నారు. కేవలం సైకిళ్లకే పరిమితమయ్యే మట్టిరోడ్లు, ప్రస్తుత నూతనంగా ఏర్పాటు చేస్తున్న సిసి, బిటి రోడ్లపై మోటార్‌సైకిళ్లు, కార్లు రయ్యుమని దూసుకెళ్తున్నాయి. కార్ల కంపెనీలు సైతం గ్రామాల్లో అవుట్‌లేట్లను ఏర్పాటు చేస్తున్నాయంటే కార్ల కొనుగోలు ఎంత వేగంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి పల్లెలు కూడా పట్నాళ్లా మారిపోతున్నాయి.