జాతీయ వార్తలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పార్లమెంటు భవన్ వద్ద రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అన్సారీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు తదితరులు స్వాగతం పలికారు. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జెఎన్‌యులో విద్యార్థుల ఆందోళనలు తదితర సంఘటనలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమాలు, ఉగ్రవాదుల దాడులు, శాంతిభద్రతలు, అధిక ధరలు, కరవుపరిస్థితులు వంటి అంశాలపై కూడా ప్రస్తుత సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించినా ప్రతిపక్షాలంతా ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది.