పర్యాటకం

నవంబర్ 14 నుండి 20 వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఏటా కార్తీకమాసంలో ఆదివేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2016 నవంబర్ 14 నుండి 20 వరకు అంటే ఏడు రోజుల పాటు బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు వేదుల శేష వెంకట వరదాచార్యులు తెలిపారు. 14 న విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురారోపణ ఉంటుంది. 15 న ఉదయం యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణ, పూర్ణాహుతి ఉంటుంది. ఇదేరోజు సాయంత్రం దేవతాహ్వానం, హోమం, శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం ఉంటాయి. 16 న ఉత్సవమూర్తులకు స్నపనపూర్ణాహుతి, ఆరాధన, వాహనోత్సవం ఉంటాయి. 17 న మూలవిరాట్టును పూలతో విశేషంగా అలంకరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు భూనీళాసమేత శ్రీ ఆదివేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. 18 న గ్రామోత్సవం, గరుడోత్సవం ఉంటాయి. 19 న ఉదయం రథోత్సవం, చక్రతీర్థం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీపుష్పయాగం ద్వాదశారాధన, దేవతోద్వాసన, ధ్వజావరోహణం చేస్తారు. ధ్వజావరోహణం, 20 న ఉత్సవాంతస్నపనం (108 కలశాలతో) అలంకరణ, రుత్విక్కుల సన్మానం ఉంటుంది. బ్రహ్మోత్సవాలు జరిగే వారంరోజుల పాటు ప్రత్యేక పూజలు చిన్నజీయర్ శిష్యులచేత జరుగుతాయని వివరించారు.