జాతీయ వార్తలు

పార్శిల్‌ బాంబు కేసు మిస్టరీని చేధించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్‌: ఒడిశాలో పార్శిల్‌ బాంబు పేలి వరుడు, అతడి బామ్మ మరణించిన కేసు మిస్టరీని పోలీసులు చేధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లెక్చరర్‌ అయిన ఓ వ్యక్తి అసూయతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 18న వారి వివాహం జరగగా, అయిదు రోజుల తర్వాత ఫిబ్రవరి 23న బొలాన్‌గిర్‌లోని వారి నివాసంలో పెళ్లి కానుకలు తెరుస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు మరణించగా వధువు తీవ్రంగా గాయపడింది. ఇల్లు ధ్వంసమైంది. పోలీసుల విచారణలో వరుడి తల్లి సంజుక్తతో పాటు పనిచేసే లెక్చరర్‌ పుంజిలాల్‌ మెహర్‌ ఈ పార్శిల్‌ బాంబు పంపించినట్లు గుర్తించారు. జ్యోతి వికాస్‌ కళాశాలలో కొన్నాళ్ల క్రితం పుంజిలాల్‌ను తీసేసి ఆ స్థానంలో సంజుక్తను ప్రిన్సిపాల్‌గా నియమించారు. దీంతో ఆగ్రహంగా ఉన్న పుంజిలాల్‌ ఆమె కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో పార్శిల్‌‌ బాంబు పంపించాడని క్రైం బ్రాంచి ఐజీపీ అరుణ్‌ బోత్రా వెల్లడించారు. గత రాత్రి పుంజిలాల్‌ను క్రైం బ్రాంచి పోలీసులు అరెస్ట్‌ చేశారు.