జాతీయ వార్తలు

పారికర్ వ్యాఖ్యలపై దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి: దేశంలో అసహనం పెరిగిపోతోందని, ఇక్కడ జీవించడం కష్టమని, భద్రత లేదని, ఒకదశలో దేశం విడిచివెళ్లిపోవాలనుకుంటున్నట్లు ఆ మధ్య వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను ఉద్దేశిస్తూ రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘అలాంటి వాళ్లకు ఓ పాఠం నేర్పాలి’ అన్న పారికర్ వ్యాఖ్యలు బెదరించేవిగా ఉన్నాయని కాంగ్రెస్ మండిపడింది. ఎటువంటి పరిస్థితలు ఏర్పడ్డాయో, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో అమీర్‌ఖాన్ ఎప్పుడో వివరించారని, అయినా ఇలా బెదరింపు ధోరణిలో హెచ్చరికలు చేయడం సబబుకాదని కాంగ్రెస్ అభిప్రాయపడింది.