రాష్ట్రీయం

పరిపూర్ణానంద స్వామికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శ్రీపీఠాధిపతి పరిపూర్ణనంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తెలంగాణ ప్రభుత్వం విధించిన నగర బహిష్కరణపై ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గత ఏడాది ఓ సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు నగర బహిష్కరణ విధిస్తున్నట్లు పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు. అంతేకాదు ఆయనను హైదరాబాద్ నుంచి కాకినాడుకు తరలించారు. దీనిపై స్వామి పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆయనపై నగర బహిష్కరణ ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కాగా సినీ విమర్శకుడు కత్తి మహేశ్ శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా స్వామి పరిపూర్ణానంద పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించతలపెట్టటం, ఈ సందర్భంలో ఆయనను గృహనిర్బంధంలో ఉంచి తదనంతరం నగర బహిష్కరణ చేస్తూ కాకినాడకు తరలించిన విషయం విదితమే.