బిజినెస్

పాక్షిక ప్రభావమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫెడ్ రిజర్వ్ వడ్డీరేటు పెంపుపై కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ పెంచిన వడ్డీరేట్ల ప్రభావం భారత్‌పై పాక్షికంగానే ఉంటుందని, భారతీయ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు తరలిపోవడానికి అవకాశాలేమీ లేవన్న విశ్వాసాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. 2006 తర్వాత సుధీర్ఘకాలం అనంతరం బుధవారం రాత్రి వడ్డీరేటును పావు శాతం మేర అమెరికా ఫెడ్ రిజర్వ్ పెంచింది. ఈ క్రమంలో పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అన్నారు. ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ అర్వింద్ సుబ్రమణ్యన్ మాట్లాడుతూ ఫెడ్ రిజర్వ్ పెంపు ప్రభావం పాక్షికంగానే ఉండొచ్చన్నారు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సిఇఒ ఆశిష్ చౌహా న్ మాట్లాడుతూ భారతీయ మార్కెట్లు ఫెడ్ రిజర్వ్ పెంపును చక్కగా ఎదుర్కొన్నాయని అభిప్రాయపడ్డారు. డిఐపిపి కార్యదర్శి అమితాబ్ కాంత్ స్పందిస్తూ ఆందోళన అక్కర్లేదన్నారు. కాగా, ఫెడ్ రిజర్వ్ పెంపు ఊహించినదేనని, అయితే భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని ఫిక్కీ ప్రధాన కార్యదర్శి ఎ దిదార్ సింగ్ అన్నారు. కరెన్సీ మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ అభిప్రాయపడ్డారు. భారత్ నుంచి విదేశీ పెట్టుబడుల తరలి పోవ అభిప్రాయాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ వెలిబుచ్చారు.