పర్యాటకం

జ్ఞానానికి నిధి.. సంతాన ప్రదాత.. పళని సుబ్రహ్మణ్యస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిదంపతులైన శివపార్వతుల కుమారుడు కుమారస్వామి. ఇతని పుట్టుక గురించి రామాయణంలో విశేషమైన కథ ఉంది. పూర్వం మానవులు, దేవతలు, సిద్దులు, సాధ్యులు కలసి మహాదేవుని ప్రార్థించి తమకు ఆటంకాలు కలిగించేవాడు, హింసించేవాడు అయన తారకా సురుని సంహరించడానికి శివకుమారుడిని ప్రసాదించమని వేడుకున్నారు. ఆ మహాదేవుని ప్రసాదం వలన శివకుమారుడు జన్మించాడు. ఆ శివకుమారుడే కుమారస్వామిగాను, స్కంధుని గాను, శరవణునిగాను, కార్తికేయునిగాను, సుబ్రహ్మణ్యేశ్వరునిగాను ప్రఖ్యాతిగాంచాడు.
ఈ శివకుమారుడే జ్ఞానానికి నిధి. సంతాన ప్రదాత. సర్వసౌభాగ్యదాత. కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా వారు వీరు అను భేదమేమీ లేక సకల జనులు కుమారుణ్ణి స్తుతిస్తారు. అట్లాంటి కుమారుడే పళినిలో నివసించి తన్ను సేవించిన వారికి సకల కోరికలు తీరుస్తానని సెలవిచ్చాడు. ఆ కుమారస్వామి నివసించిన పర్వతమే పళని దివ్యక్షేత్రంగా పేరుపొందింది.
ఈ పళనిక్షేత్రంలో కుమారస్వామిని దర్శించు కుంటే మరుజన్మలేనిమోక్షం సంప్రాప్త వౌతుంది. శివసాయుజ్యం లభ్యవౌతుంది. మహిమా న్వితమైన ఈ క్షేత్రదర్శనం పూర్వజన్మపుణ్యంగా కార్తికేయుని భక్తులు తలుస్తారు. ‘‘అరుపడైవీడు’’గా ప్రసిద్ధి చెందిన కుమారుని ఆలయాల్లో పళని ఒకటిగా ప్రసిద్ధిచెందింది.
ఇక్కడి స్థలపురాణాల ప్రకారం పూర్వం ఒకసారి నారదమహర్షి ఓ పండును శివునికి సమర్పించాడు. ఆ ఫలానే్న తన కుమారులైన గణేశునకు, కుమారునికి శివుడు ఇవ్వాలని ముచ్చట పడగా నారదుడు ఇది జ్ఞానఫలము. దీన్ని విభజించకుండా ఏ ఒక్కరికైనా ఇమ్ము అని నారదుడు శివునికి చెప్పాడట. అపుడు నారదుని మాట ప్రకారం శివుడు తన కుమారులిద్దరిని పిలిచి మీలో ఎవరు ఈ విశ్వాన్నంతా మూడు పర్యా యాలు చుట్టి వస్తారో వారికీ జ్ఞానఫలాన్ని ఇస్తానని చెప్పాడట. తండ్రిమాట ప్రకారం కుమార స్వామి తన వాహనమైన నెమలిని అధిరోహించి విశ్వపర్యటనకు వెళ్లాడు. మరుగుజ్జు ఆకారంతోను, లంబోదరంతోను ఉన్న గణేశుడు ఆలోచించి తండ్రినే తనకు మార్గం చూపించమని వేఋ కున్నాడు. తండ్రి ఆదేశం మేరకు పార్వతీ పరమేశ్వరులైన తన తల్లితండ్రులను కూర్చోబెట్టి గణేశుడు ముమ్మారు వారికి ప్రదక్షణం చేశాడు. దానివలనే కుమారస్వామి కన్నా ముందుగా విశ్వప్రదక్షణ ఫలం గణేశునకు దక్కింది. శివుడు మాట ప్రకారం నారదుడిచ్చిన జ్ఞాన ఫలాన్ని గణేశునకు ఇచ్చాడు.
ఆ తరువాత వచ్చి విషయం తెలుసుకొన్న కుమారస్వామి ఆగ్రహించాడు. వెనువెంటనే కైలాసం వీడి ఈ పళని ప్రాంతానికి వచ్చి తపస్సు చేయసాగాడు. తల్లితండ్రులైన పార్వతీ పరమేశ్వ రులు ఈ ప్రాంతానికి వచ్చి ‘‘కుమారా నీవే జ్ఞానమై ఉండగా నీకు వేరే ఫలాలెందుకు’’ అని బుజ్జగించారు. కాని కోపోద్రిక్తుడైన కుమారుడు కోపాన్ని వీడక ఇక్కడే ఉండిపోయాడు.‘‘జ్ఞానఫలమే నీవు అప్పా’’ నీవే జ్ఞానముయొక్క ప్రతి రూపమై యున్నావు అని శివుడు ఎంతగానో నచ్చచెప్పగా కుమారుడు కోపాన్ని దూరం చేసుకొన్నాడు. కాని ఈ ప్రాంతంలో వసించాడు కనుక జ్ఞానమే రూపంగా కలిగిన వాడు కనుక కుమారస్వామి తన్ను ఈ ప్రదేశంలో అర్చించిన వారికి వారు కోరకుండానే జ్ఞానాన్ని ఇస్తానని చెప్పాడట. అంతేకాక ఏ కోరికతో తన్ను సేవించినా ఆ కోరిక నెరవేరుతుందనే వరాన్ని కూడా ఇచ్చాడని ఈ స్థలపురాణం చెప్తోంది.
ఈ జ్ఞానఫలమున్న ఈ ప్రదేశానికి ఫలం అనే పేరు ఏర్పడి రాను రాను అది పళనిగా మారిందనీ ఇక్కడి స్థానికులు చెప్తారు. ఈ పళని క్షేత్రంలోని కుమారుని విగ్రహం సాధురూపంలో ఉండడానికి కారణం ఇక్కడి 18మంది సిద్దుల్లో ఒకరైన భోగర్ మహర్షి అని అంటారు. ఇతను నవపాషాణాల విషముతో ఈ కుమారుస్వామిని తయారు చేశాడట. అందుకనే ఈ భోగర్ మహర్షికి కూడా ఇక్కడి ఆలయం ఉంది. ఈ పర్వతగుహల్లో ఈ సిద్దుడు తపస్సు చేశాడని అంటారు.
ఈ ఆలయంలోని కుమారస్వామి సన్యాసి వేషం మాదిరిగా నడుముకు గోచిని, చేతిలో దండాన్ని ధరించి భక్తులకు దర్శనం ఇస్తాడు. ఇక్కడి కుమారస్వామి పెద్ద పెద్ద చెవులతో కేవలం భక్తుల మొరను వినడానికే ఉన్నానన్నట్టుగా దర్శనం ఇస్తాడు.
ఈ పళని కుమారునికి రాత్రిపూట చందనాన్ని అలంకరిస్తారు. ఈ చందనం మరుసటిరోజుకు ఔషధీగుణాలు కలిగినదిగా మారుతుందని దాన్ని తీసుకొన్నవారికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఈ చందన సేకరణకు భక్తులు తాపత్రయ పడు తుంటారు. అంతే కాక ఈ స్వామికి నూనెలు, గంధము, పాలు, తైలాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వర్తిస్తారు. స్వామికి రాత్రిపూట విశేషంగా శయనసేవ అనే ఉపచారాన్ని చేస్తుంటారు. ఈ వేళలో స్వామి పడుకొని అలసట తీర్చుకునే సమయంగా భావించి ఆలయ సంరక్షకులు స్వామికి జమా ఖర్చులు వినిపిస్తారట. ఆ తరువాత స్వామికి జోలపాటలు పాడి నిద్ర పుచ్చుతారని ఇక్కడి భక్తులు చెప్తారు.
స్వామికి విశేష పూజలే కాక ప్రత్యేక ఉత్స వాలను జరిపిస్తారు. ఈ స్వామికి కావడి మొక్కులు కూడా ఎక్కువగా ఉంటుంటాయ. ఈ స్వామిని దర్శించడం సర్వపాపహరం అని భావిస్తారు. స్వామిని దర్శించినందువల్ల అటు మానసికా నందమూ ఇటు ఈ ప్రదేశంలోని ప్రకృతి అందాలను కనులారా గాంచినందువల్ల హృదయా నందమూ కలుగుతాయంటారు ఈ కోవెల సందర్శకులు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు