పర్యాటకం

వేదస్వరూపుడు వేదాద్రి నిలయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపదుద్దారకస్వామిగా నరసింహాస్వామిని కొనియాడుతారు. ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించ డానికి స్వామి నారసింహుడుగా రూపమెత్తి స్తంభంలోనుంచి ఉద్భవించాడు. అట్లానే ఏభక్తుడు ఏవిధంగా తన్ను దర్శించాలని అనుకొంటే ఆ రూపంలో తన్నుతాను సృజించుకునేస్వామి నే నరసింహావతారుడు. ఒకానొక కాలంలో వేదాలను సోమకాసురుడను రాక్షసుడు దొంగలించాడు. వాటిని తీసుకెళ్లి సముద్రంలో దాచాడు. భక్తవత్స లుడైన శ్రీమన్నారాయణుడుతో బ్రహ్మదేవుడు వేదాపహారం జరిగిందని వేదోద్దరణ చేయమని ప్రార్థించాడు. అపుడు ఆ మహావిష్ణువు తాను మత్స్యావతారుడై వేదాలను సంరక్షించాడు. ఆ మత్స్యావతారుడే వేదాద్రిలో కొలువై జ్వాలానరసింహునిగా కీర్తించబడుతున్నాడు.
ఈ వేదాద్రిక్షేత్రముకృష్ణానథీ తీరానికి అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లా, నల్గొండ జిల్లాలలో విలసిల్లిన పంచనరసింహక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. మంగళగిరి, వాడపల్లి, కేతవరం, గుంటూరు జిల్లాలో, కృష్ణాజిల్లాలో వేదాద్రి. నల్గొండ జిల్లాలో మట్టపల్లి క్షేత్రాలలో ప్రబలమైనదిగా వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామిని మహిమ వేన్నోళ్లున్నా వర్ణించవీలుకానిది- విజయవాడ-హైదరాబాద్ రహదారిలో ‘చిల్లకల్లు’ కూడలి నుండి పడమరగా 10 కిలోమీటర్లు దూరంలో వేదాద్రి క్షేత్రమున్నది. ఈ నరసింహాస్వామిని ఋష్యశృంగాధి మహర్షులు, మనువు లు యోగానంద నృసింహ స్వరూపునిగా కీర్తించారు కనుక యోగానంద నృసింహునిగా భక్తులకు దర్శనమిస్తాడు..
వేద శిఖరమున జ్వాలా నృసింహాకృతితోను, కృష్ణానది గర్భమున సాలగ్రామ రూపంతోను, వౌనిచంద్రుడు ఋష్యశృంగునిచే ప్రతిష్టింపబడిన యోగమూర్తిగాను, క్షేత్రపాలకునిగా యోగనంద లక్ష్మీ నరసింహస్వామిగాను పంచనారసింహ (జ్వాల, సాలగ్రామ, వీర, యోగానంద, లక్ష్మీనృసింహమూర్తులు) క్షేత్రమైన వేదాద్రి యావదాంధ్ర దేశమునుండి భక్తులనాకర్షించుచూ పవిత్ర పుణ్యక్షేత్రముగా అలరారుచున్నది. ఎనిమిది, తొమ్మిది వందల సంవత్సరముల క్రిందట రెడ్డిరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఎఱ్ఱాప్రగడ, శ్రీనాథ మహాకవి లాంటి కవులు, శ్రీ నారాయణ యతీంద్రులాంటివారు ఈ క్షేత్ర మహాత్వాన్ని ఎన్నోవిధాలుగా కీర్తించి పునీతులయ్యారు, నారాయణతీర్థుల గురించి ఒక ప్రసిద్ధ సంఘటన ఇక్కడి నివాసితులు చెబుతుంటారు. అది ఏమన- శ్రీ నారాయణతీర్థులు ఒకసారి తమ అత్తవారి ఇల్లు వేదగిరికెదురుగా ‘‘గింజుపల్లి’’ గ్రామమునకు వెళ్ళి తిరిగి వచ్చేటపుడు కృష్ణలో ‘రావిరాల’ గ్రామమువద్ద వాగు దాటుచుండగా ఆ నీటిలోమునిగిపోయారు. ఏమి చేయాలో తోచక భగవంతుడే దిక్కుఅని నరసింహాస్వామిని వేడుకున్నారు. అపుడు నేను సన్యాసిస్తానని అన్నవెంటనే ఆ నీటి ప్రవాహఉదృతి తగ్గి స్వామి బయటపడ్డారు. ఇక అప్పటినుంచి మానసికంగా సన్యసించి జీవన్ముక్తులయ్యారు. ఆ క్షణంలోనే నారాయణతీర్థులు ఆశువుగా కవితాధారతో వేదగిరీశుని ‘‘వేదాద్రి శిఖర నారసింహా కలయాయతే’’ అను స్తుతించి స్వామి అనుగ్రహాన్ని పొంది, లోకోద్ధరణగా సంస్కృతంలో శ్రీకృష్ణ లీలా తరంగిణి తరంగ కీర్తనలు రచించి స్వామివారి దయకు ప్రాతమయ్యారు.
వేదాద్రి క్షేత్రము కవులకు, రాజులకు పండితులకుమారుపేరుగా పేరెన్నికగన్నది. అంద కే చారిత్రిక విశేషాలతోను, అటు సాహిత్య వినువీధిలోను వేదాద్రిక్షేత్రమహాత్మ్యము వేనోళ్ల కొనియాడబడుతోంది. స్నానాదులచేత కూడా పవిత్రమొనరించు పుణ్య నదీపరివాహమే.
స్వామివారికి త్రికాలార్చనలు, నిత్యోత్సవము, పక్షోత్సవము, మాసోత్సవములు యధావిధిగా నిర్వహించుచున్నారు. వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలు పంచాహ్నికంగా స్వామివారికి కళ్యాణము, వైశాఖ శుద్ధ చతుర్దశి రాత్రి ప్రతి సంవత్సరం నిర్వహించటం జరుగుతోంది. ముక్కోటి ఏకాదశి వైభవముగా నిర్వహిస్తారు. ఆ సందర్భం 3 రోజులు అధ్యయనోత్సవములు, నాల్గవ (4) రోజున గోదాదేవి కళ్యాణము జరుపుతారు. తొలి ఏకాదశి, పర్వదినాలలో కళ్యాణములు నిర్వ హిస్తారు.
వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర దర్శనం పుణ్యప్రదం.

- సి.విజయలక్ష్మి