పర్యాటకం

ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న ఆనందవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహా విశిష్టత, పవిత్రత, శక్తితత్వం ఈ మూడు కలసి ఉన్న తావే ఆనందవనం. నడిచే దైవంగా ప్రజల పూజలందుకున్న పరమ పూజ్య సద్గురు శివానందమూర్తి నిర్మించిన వనమే ఆనందవనం. ఇక్కడ యోగ మహాగణపతి, మహాలక్ష్మి అమ్మవార్ల దర్శనానికి విశేష ప్రాముఖ్యముంది.
భీమిలి ఆనందవనంలో ఎటు చూసినా ఆధ్యాత్మిక విశేషాలే. ఏ వైపు చూచినా భక్తితత్వం ఉట్టిపడుతుంటుంది. అందులోను సద్గురు నివసించిన ప్రదేశం.. ప్రజలు సుఖ, సంతోషాలతో విరాజిల్లాలన్న సత్ సంకల్పంతో సద్గురు శ్రీ శ్రీ శ్రీ శివానంద మూర్తిగారు ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. ప్రజలకు భగవదనుగ్రహం కల్పించాలనీ వారిని ఆధ్యాత్మిక పథంలో నడిపించి వారిని సత్యధర్మాలకు ప్రతీకలుగా చేయాలన్న దృఢ సంకల్పంతో పరమ పూజ్య గురువుగారు విశేషమైన ఆలయాలను ఇదే ఆశ్రమంలో నిర్మించారు.
1978లో భక్తులకు, శిష్యులకు దూరంగా ఒక ప్రదేశంలో ఏకాంతంగా తపస్సు చేసుకోవాలనే ఆలోచనతో సద్గురు కందుకూరి శివానందమూర్తి భీమిలి ప్రాంతానికి విచ్చేశారు. భీమిలి బ్యాంకు కాలనీ వద్ద ఐదెకరాల స్థలం తీసుకొని దానికి ఆనందవనంగా పేరుపెట్టి 2001లో మాఘశుద్ధ సప్తమి (రథసప్తమి) పుణ్య దినాన యోగ మహాగణపతి విగ్రహాన్ని సద్గురు స్వయంగా ప్రవేశ ద్వారం దగ్గరే ప్రతిష్ఠించారు. ఈ మహాయోగ గణపతి ఆలయం ఆశ్రమ ప్రవేశ ద్వారం దగ్గరే కనబడుతూ సాధకులలో ఏకాగ్రతను పెంచుతోంది. నాటినుంచి నేటివరకు ఆ పార్వతీ తనయుడు సద్గురు ఆశ్రమంలో నిత్య పూజలు అందుకుంటూ భక్తులను కరుణిస్తున్నారు. ఆనందవన క్షేత్రంలో 1979లో గురూజీ పరమగురు స్థానాన్ని స్థాపించారు. ‘సుబ్రహ్మణ్యేశ్వర శ్రీకృష్ణ’ అంశంతో ఉన్న మహాయోగినిని పరమగురువు అంటుంటారు. వీరు ఐదు వేల సంవత్సరాలుగా హిమాలయాల్లో తపస్సులో ఉన్నారని భక్తుల నమ్మకం. వీరి ప్రాభవాన్ని పరమగురు స్థానంలో సద్గురు ప్రతిష్ఠించారు.
యోగ మహాగణపతి విగ్రహానికి అరుణాచల కొండ నుండి రాయిని తెప్పించి నైపుణ్యశాలియైన శిల్పి దండపాణి స్థపతిచే చెన్నైలో సద్గురు తయారు చేయించారు.
కాశీకి సమానమైన క్షేత్రంగా ఆనందవనం
ఈ ఆనందవనాన్ని కాశీకి సమానమైన క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నది సద్గురు సంకల్పం. కాశీలో మాదిరి సాక్షిగణపతి, డుంఠి గణపతి, అన్నపూర్ణ అమ్మవారు, విశ్వనాథుడు ఏవిధంగా దర్శనమిస్తారో సరిగ్గా అలాగే ఇక్కడ భక్తులకు ఆయా దేవతల దర్శన భాగ్యం కల్పించాలని పూజ్య శివానందమూర్తి ఎల్లప్పుడూ ఆలోచించేవారని ఆశ్రమ నిర్వాహకులు రాఘవేంద్రన్ అన్నారు.
ఈ ఆశ్రమానికి విచ్చేసిన భక్తులు మొట్టమొదట సాక్షి గణపతిని దర్శించుకుంటారు. ఇక్కడ సాక్షి గణపతి అంటే సర్వ జగత్తుకు సాక్షి అని అర్ధం. అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కాశీలో అన్నపూర్ణగా దర్శనమిస్తే ఇక్కడ ఈ అనందవనం ప్రాంతంలో మహలక్ష్మి అమ్మవారుగా కూడా భక్తులకు దర్శనం ఇవ్వాలని సద్గురు ఆకాంక్ష. భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలాగా తూర్పు ప్రాంతం సుభిక్షం కాలేదు. అక్కడంతా దారిద్య్రం తాండవిస్తోంది. ఈస్టిండియా కంపెనీ వారు తూర్పు ప్రాంతంలో లాభార్జనే ధ్యేయం గా ప్రజలకు మేలు లేకుండా చేశారు. అయితే పశ్చిమ ప్రాంతం సుభిక్షంగా ఉండడానికి కారణం అక్కడ మహాలక్ష్మి ఆలయ ప్రభావమేనని తలచిన సద్గురు ఆనందవనంలో కూడా మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి ఆ అమ్మ ఆలయాన్ని నిర్మిస్తే, ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉంటారని పూజ్య శివానందమూర్తి భావించారు.
ఆలయ ప్రాముఖ్యత
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన పద్మవిభూషణ్ బిరుదాంకితుడు, ఒడిశాకు చెందిన రఘునాథ్ మహాపాత్రో అనే మహాశిల్పి ఒడిశాలోని ఆలయాల మాదిరి ఆనందవనంలో మహాలక్ష్మి ఆలయాన్ని మలిచారు. దీని శిఖరం నేల నుండి ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. అమ్మవారి విగ్రహం మరకత రాయితో తయారు చేశారు. మయూర్‌గంజ్ వద్ద గల ఏకశిల గ్రీన్‌స్టోన్ దొరికింది. ఆ శిలనే మహాలక్ష్మీ దేవి విగ్రహంగా మలిచారు. ఇటువంటి ఆలయం దక్షిణ భారత దేశంలోనే రెండోది. మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి ప్రతిష్ఠించారు. మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో హుండీలేదు. కార్యక్రమాలు నిర్వహించడానికి ఎవరి నుంచి విరాళాలు వసూలు చేయరు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పక్కన ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సద్గురు శివానందమూర్తి జ్ఞాన మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఈ మందిరాలదర్శనంతో జనుల్లో ఆధ్యాత్మికత పెరుగుతుందని ఇక్కడి భక్తుల భావన.

- చలపతిరావు