పర్యాటకం

పీడలను దూరం చేసే బేడీల హనుమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి అనగానే శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్షేత్రమని మనస్సులో మెదలుతుంది. తిరుమలలో హనుమంతుని ఆలయాలూ ఉన్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించినవారు ఆంజనేయస్వామిని కూడా దర్శించుకుంటారు. తిరుపతి కొండల్లో ఓ కొండపేరు అంజనాద్రి. రామభక్త ఆంజనేయుడు తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న సన్నిధి వీధిలో కొలువుతీరి భక్తులకు ధర్మాచరణపై మక్కువ పెంచుకోమని చెప్తుంటారు. ఈ ఆలయంలోని హనుమంతుడు బేడి ఆంజనేయస్వామిగా భక్తులచేత పూజలను అందుకుంటున్నాడు. ఈయనకు ఈ పేరు ఏర్పడటానికి వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. అంజనాద్రిపై అల్లరి చేస్తూ విసిగిస్తున్న ఆంజనేయుడిని తల్లి అంజనాదేవి చేతులకు, కాళ్ళకు బేడీలు వేసి, ఇటూ అటూ పరుగులు తీయకుండా ఆపినందువల్లే ఈ ఆంజనేయునకు ఇప్పటికీ బేడీలు వేస్తారు. అంతేకాక ఈ బేడీఆంజనేయుని దర్శించినవారికి పీడలు దూరం అవుతాయని మారుతి భక్తుల నమ్మకం. ఇక్కడి అర్చకులు. పశ్చిమాభిముఖంగా ముఖమంటపం, ప్రదక్షిణ మంటపం ఉన్నాయి. గర్భాలయంపైన ఏకకలశ గోపురం ఉంది. గర్భాలయం మధ్యలో ఆరు అడుగుల ఎత్తుతో శ్రీ బేడి ఆంజనేయస్వామి కొలువై ఉన్నారు. ప్రతి ఆదివారం పంచామృతాభిషేకం జరుగుతుంది. ప్రతి నెల పునర్వసు నక్షత్రంనాడు సీతారామలక్ష్మణులు అక్కడకు వస్తారని భావిస్తూ, వారికి ఇచ్చిన శేష హారతిని, శ్రీరాములవారి మెడలోని పుష్పహారాన్ని బేడి ఆంజనేయస్వామికి అలంకరిస్తారు.
తిరుమలలో ఉన్న కోనేటికి ఈశాన్య మూలగా, వరాహస్వామివారికి అభిముఖంగా శ్రీ హనుమంతుని ఆలయం నిర్మించబడి ఉంది. కోనేటి గట్టుమీద ఈ స్వామి ఆలయం ఉండటంవల్ల, ఈ స్వామికి కోనేటి గట్టు ఆంజనేయస్వామి అన్న పేరుకూడా ఉంది. శ్రీ ఆంజనేయస్వామివారు నిలబడి నమస్కార భంగిమలో ఇక్కడ కొలువై ఉన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ జాబాలి ఆంజనేయస్వామి కోవెల ఉంది. ఆంజనేయుని తల్లి అయిన అంజనాదేవి అంజనాద్రి కొండమీద తపస్సు చేసినట్లుగా పురాణాలు తెలిపాయి. అంతేకాదు, ఆంజనేయుని జన్మస్థానం కూడా ఇదే. మారుతి బాల్యంలో సూర్యభగవానుని ఒక పండుగా భావించి, ఎగురుతూ ఆకాశానికి చేరుకుని సూర్యుని మింగబోయినది కూడా ఇక్కడేనని తెలుస్తోంది. ఒకసారి జాబాలి అనే మహర్షి అనేక ప్రాంతాలను పర్యటించి, ఈ ప్రాంతానికి చేరుకుని తపస్సు చేయసాగారు. ఆయన తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఆ మహర్షికి దర్శనమిచ్చారు.ఆ మహర్షి కోరికను సమ్మతించిన హనుమంతుడు, స్వయంభువుగా ఇక్కడ అవతరించారు. అందుకే శ్రీ జాబాలి ఆంజనేయస్వామి అనే పేరు ఏర్పడింది.

- కె.నిర్మల