పర్యాటకం

చూచువారలకు చూడముచ్చట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముని ఆలయాలు, మారుతి వీక్షణలు ప్రపంచంలో ఏ మూల చూసినా కనిపిస్తాయి. అందులో ఆ రామునిపై ప్రేమ, భక్తి ఉన్న వారిలో తెలుగు రాష్ట్రాలవారే ముందంజలో ఉంటారు. ఆ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ ఉగాది నుంచి చైత్ర శుద్ధ నవమినాడు జరుగబోయే శ్రీరామ జననం, సీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలతో అంకురార్పణ చేశారు. వసంత నవరాత్రుల పేరిట ధార్మికులంతా రామునికథను ఉగాది నుంచే పఠనం సాగిస్తున్నారు. ఆ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలల్లో కొన్నింటి వివరాలు...
భద్రాద్రి రామాలయం:
తన్ను కోరి కొలిచిన భద్రునికిచ్చిన మాటమేరకు రాముడు భద్రాదిలో కొలువైయ్యాడు. తనే్న దైవంగా కొలిచే తాళ్లపాక దమ్మక్కకు కలలో కనిపించి ‘‘నేను భద్రుని కొండపై ఎండావానకు తాళలేకున్నాను. నన్ను సురక్షిత ప్రదేశానికి కొనిపొ’’మ్మని ఆదేశించాడు. ఆ దమ్మక్క తన పూర్వజన్మ పుణ్యఫలమంటూ ఆ సీతారాముల వారిని వెతికి తెచ్చింది. ఓ పూరిపాక వేసి అందులో నివసించమని ఎల్లవేళలా కాపాడుతూ వచ్చింది.
తనే్న నమ్ముకుని రామనామంతో పులకరించిపోయే కంచెర్ల గోపన్నకు తనకు ఆలయనిర్మాణం చేయించాలన్న ఆలోచనను పురికొల్పాడు. పాపమా గోపన్న ప్రభుత్వ సొమ్ముతో రామాలయాన్ని. రాముని పరివారానికి ఆభరణాలను ఎంతో ఆనందంతో చేయించాడు. ప్రభుత్వసొమ్మును కాజేవంటూ తానీషా గోపన్నను ఖైదుచేశాడు. రాముడే తనకు దేముడని అతడే తన్ను కాపాడుతాడని మనసావాచా నమ్మి అహర్నిశమూ రామనామంతో తపించిపోయే ఆ గోప న్న రామదాసుగా స్థిరపడ్డాడు. రామదాసుయైన గోపన్నను రక్షించదలచి రామలక్ష్మణులు తానీషా వద్దకు రా మోజీ, లక్ష్మోజిగా వచ్చి గోపన్న ఖర్చుచేసిన ధనాన్ని జమచేసి రామదాసును ఖైదు విడిపించారు. ఇంతటి కథను కలిగిన భద్రాది నేడు అత్యంత ఆదరణీయంగా రామకల్యాణాన్ని జరుపుకుంటుంది.
గొల్లలమామిడాడ
కోదండరామస్వామి ఆలయం:
తూర్పు గోదావరి జిల్లా గొల్లలమామిడాడలో నివసించే సుబ్బిరెడ్డి, రామిరెడ్డి అనేసోదరులకు విష్ణ్భుగవానుడు స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ కోదండ రామునిగా కొలువుదీరుతాను. నా కొరకు ఓ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. వారు అమితా శ్చర్యాలతో పెద్దలతో చర్చించి ఆలయ నిర్మాణానికి పూనుకొన్నారట. అదే శ్రీ కోదండ రామస్వామి ఆలయం. రాజమండ్రి నుంచి 25 కి.మీ దూరంలో వుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు జీవితం ధారపోసిన కోదండరాముడి మహిమాన్విత ఔదార్యాన్ని అంతెత్తుకు ఎత్తి నిలబెట్టిందా అనిపింపచేసే ఆలయ గోపుర నిర్మాణ వైశిష్ట్యం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఆలయ ప్రవేశ గాలిగోపురం 160 మీ. ఎత్తయిన 10 అంతస్తుల నిర్మాణం! గొల్లమామిడాడ రామాలయం ధార్మిక ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్పఆలయంగా రూపుదిద్దుకుంది. గాలిగోపురంలోని ప్రతి అంతస్తులోనూ శ్రీరామచంద్రుడి జీవిత ఘటనలకు చెందిన శిల్ప నిర్మాణాలతో అల రారుతుంటాయ. స్వామివారి దర్శనార్ధం వేంచేసే భక్తుల హృదయాలలో కొలువైఉన్నరామలక్ష్మణ సీతమ్మవార్ల అపురూపమైన భావనామూర్తులు విగ్రహాలలో కనిపించి ఒక అలౌకికానందానికి లోనుచేస్తే ఆలయ నిర్మాణ వైశిష్ట్యమూ వారిని పరవశుల్ని చేస్తుంది. ఈ నవరాత్రి ఉత్సవాలతో ప్రతిరోజు రామలీలలు, నాటకాలు, భజనలు, జాతరలతో శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించబడుతుంది.
ఒంటిమిట్ట రామాలయం
ఇక్కడ కూడా ఒంటెడు, మిట్టడు అనే సోదరులకు స్వప్నసాక్షాత్కరం ఇచ్చిన శ్రీహరినే తాను కోదండరామునిగా అవతరిస్తానని తనకో ఆలయాన్ని నిర్మించమని చెప్పారంటారు. ఆ సోదరుల ప్రయత్నఫలంగా ఏర్పడిన ఆలయం కనుక ఒంటిమిట్ట కోదండరామాలయంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ సీతారాములు త్రేతాయుగంలో నడయాడి నట్లు పురాణాలు చెప్తున్నాయ. ఇక్కడ సీతారామలక్ష్మణులు ఆంజనేయుడు లేకుండానే నివసిస్తున్నారు. ఇక్కడి కోదండరాముని బ్రహ్మోత్సవాలను లక్ష్మీదేవి సోదరుడు చూడడం కోసం వెనె్నల రాత్రుల్లో జరిపించడం విశేషం. ఈ ఒంటిమిట్ట ఆలయం కడప నుంచి సుమారు 26 కి.మీ దూరంలో ఒంటిమిట్ట అన్న ప్రదేశంలో అలరారుతోంది. ఇక్కడ రాత్రుళ్లు జరిగే శ్రీరామ జననోత్సవాలు, వివాహ మహోత్సవాలను తిలకించడానికి వేయికనులున్నా చాలవంటారు.
తిరుపతి కోదండరామాలయం
కలియుగదైవంగా భాసించే తిరుమల క్షేత్రంలోను శ్రీరాముడు కోదండ రాముడుగా ఆలయంలో కుదురుకున్నాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతోకలసి అయోధ్యకువెళుతూ మార్గమధ్యంలో ఈ తిరుపతి లో కొన్నాళ్లు సేద తీరాడట. ఆంజనేయ, సుగ్రీవ, జాంబవంతాదులతో పాటు విభీషణాదులతో కూడి ఉన్న రామునికోసం జాంబవంతుడు ఈ ఆలయ నిర్మాణం చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. జనమేజమహారాజు ఈ ఆలయ పునఃనిర్మాణాన్నిచేసినట్లు చారిత్రిక కథనం పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో ముఖ మండపంలోనే భక్తాంజనేయుడు కూడా కొలువై ఉన్నాడు.
ఇక్కడ ముఖమండపంలోంచి ప్రదక్షణ మండపాల్లో 18 స్తంభాల్లో ముఖమండపంలోకి ప్రవేశించే మార్గంలో ఎడమవైపున్న గదికి బయటనున్న స్తంభం వైపు తిరుమల గర్భాలయ గోపురం పైన ఉన్న విమానవేంకటేశ్వరుడు దర్శనం ఇవ్వడం ఈ కోదండ ఆలయపు ప్రత్యేకత. ఈ కోదండరాముడు ఒకచేతిలో కోదండాన్ని, మరోచేతిలో బాణాన్ని ధరించి ఉన్నారు. కుడివైపున సీతాదేవి, ఎడమవైపున లక్ష్మణస్వామి కొలువై ఉన్నారు. చైత్రశుద్ధ నవమినాడు జరిగే కమ నీయమైన సీతారామ కల్యాణ శోభను చూచితీరవలసిందే కాని వర్ణించడానికి వీలులేదు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు