పర్యాటకం

శ్రీరామ దూతం.. శ్రీరామ పాద క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కని ప్రశాంత వాతావరణం, చల్లని ఆహ్లాదకరమైన పంటచేలు, తూర్పున ఉదయించే ఉదయభానుని తొలి సంధ్యా కిరణాల వెలుగులో పాల రాతిలా తెల్లగా మెరిసిపోయే నిండైన దృశ్యం. తనను తలచి, పిలిచి, కొలిచే భక్తజనావళికి అభయమిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో విజయవాడకు 35 కిలోమీటర్ల దూరంలో 9వ నెంబరు జాతీయ రహదారి పక్కన కంచికచర్ల మండలం, పరిటాల గ్రామానికి తూర్పు దిశగా సువిశాల ప్రదేశంలో మనసును దోచే మనోహరమైన 135 అడుగుల ఎతె్తైన శ్రీ దివ్య సుందర అభయ వీరహనుమాన్ విగ్రహం ఆసియా ఖండంలోనే అతి పెద్ద వీరహనుమన్ విగ్రహంగా ప్రసిద్ధిగాంచి ప్రతినిత్యం భక్తజనవాహినితో కళకళలాడుతూ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అందరినీ ఆకర్షిస్తోంది.
ఈ విగ్రహ నిర్మాణానికి, క్షేత్ర అభివృద్ధికి ముఖ్యకారణమైన వ్యక్తి, మహోన్నత ఆశయంతో విగ్రహ ప్రతిష్ఠాపన కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని తను సాధించదలచిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించిన ఆంజనేయస్వామి భక్తుడు శ్రీ గార్గి వేద విద్యాలయ సొసైటీ వ్యవస్థాపకుడు శ్రీ బోడేపూడి వెంకటేశ్వరరావు. శ్రీరామపాద క్షేత్రంగా పేరొందిన ఈ క్షేత్రం నిర్మాణం కన్నా ముందు పరిటాల గ్రామానికి ప డమర వైపు శ్రీ షిరిడి సాయినాధుని క్షేత్రాన్ని నిర్మాణంగావించారు.. శ్రీరామునికి నమ్మినబంటుగా ఆంజనేయస్వామి వలెనే హనమాన్ భక్తునిగా చెప్పదగిన వ్యక్తి శ్రీ బోడేపూడి వెంకటేశ్వరరావు. ఎంతో కష్టతరమైన ఈ విగ్రహ నిర్మాణానికి ముందు రుూ స్థలాన్ని పుణ్యస్థలంగా మార్చటానికి చాలామంది భక్తులు నిర్విరామంగా కృషిచేశారు. 2000 సంవత్సరం మే 28 హనుమజ్జయంతి రోజున విగ్రహ ప్రతిష్ఠాపనా సంకల్పంతో నిత్య పారాయణగా ప్రతి 6 గంటలకు ఒక షిఫ్ట్‌గా రోజుకు నాలుగు షిఫ్ట్‌లుగా హనుమాన్ చాలీసా పారాయం మొదలుపెట్టారు. అలా 2001 ఏప్రిల్ 28 వరకు పదకొండు నెలలపాటు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. చివరిరోజు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ వీర హనుమాన్ విగ్రహానికి ఒకొక్క అడుగుకి 1000 సార్లుగా భావించి మొత్తం 135 అడుగులకు ఒక లక్షా ముప్ఫయి ఐదు వేల సార్లు హనుమాన్ చాలీసా పఠించడం జరిగింది. 15 అడుగుల పీఠభాగం నిర్మించాలనే ధ్యేయంతో 2001 ఏప్రియల్ 30వ తేదీన శంకుస్థాపన చేశారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానందగిరి స్వామివారు నిర్వహించారు. ఈ విగ్రహ నిర్మాణానికి ఇద్దరు ప్రముఖ ఇంజనీర్లు నిర్మాణ నమూనాని రూపొందించారు. రాజమండ్రి దగ్గరలో వున్న పెద్దాపురం వాస్తవ్యులైన జాన్‌పాల్ అనే శల్పి రుూ విగ్రహ నిర్మాణం గావించారు. ఈ విగ్రహ నిర్మాణం రెండు సంవత్సరాలుపైగా జరిగింది. ఈ విగ్రహం బరువు 2500 టన్నులు. విగ్రహం నిర్మాణానికి 4వేల సిమెంటు బస్తాలు, 150 టన్నుల ఇనుము, వెయ్యి లారీల ఇసుక వినియోగించారు. 35 అడుగుల లోతు పునాదితో నిర్మించారు. భూమి నుండి 45 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తులో ధ్యాన మందిరం నిర్మించారు. ఆరు రోజులు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం 2003 జూన్ 22న విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. పీఠంగా నిర్మిచిన విశాల ధ్యాన మందిరం మధ్య మూల విరాట్‌ని ప్రతిష్ఠించడంతోపాటు దాన్ని ఒక చక్కని దేవాలయంగా తీర్చిదిద్దారు.
ఈ క్షేత్రంలో క్షేత్రపాలన దేవత రేణుకాదేవి. శ్రీ గణేశ, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రం త్రివేణి సంగమంగా పేరొందేలా దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం ఏర్పాటుగావించారు. ఇక్కడ నిర్వహించే వేద పాఠశాలలో కుల, మత విచక్షం లేకుండా అందరూ విద్యనభ్యసించవచ్చు. పేదవారికి వైద్య సదుపాయాన్ని కలిగించాలన్న సదుద్దేశ్యంతో వైద్యశాల నిర్వహణను కూడా చేపట్టారు.
ఈ విగ్రహం గుంటూరు జిల్లా అమరావతి దగ్గరలోని వైకుంఠపురం, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం ప్రాంతాలకు కూడా కనిపిస్తుంది. 20 కిలోమీటర్ల దూరం వరకు కనిపించే రుూ వీర హనుమాన్ విగ్రహాన్ని దర్శించటానికి రాష్ట్రంలోని భక్తులతోపాటు తమిళనాడు, కర్నాటక వంటి ఇతర రాష్ట్రాలనండి అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శిస్తున్నారు. ఉత్తరాభిముఖంగా వుండే ముఖద్వారం గుండా లోనికి ప్రవేశించి ఒక్కసారి తలపైకెత్తితే చాలు మానవాతీత, మహిమాన్విత శక్తి స్వరూపుడైన శ్రీ అభయ ఆంజనేయస్వామి దివ్య సుందర రూపాన్ని దర్శించవచ్చు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మికత వున్న ప్రతి వ్యక్తి తప్పక దర్శించవచ్చు. శ్రీరామపాద క్షేత్రంగా భాసిల్లుతున్న ఈ దివ్య సుందర అభయ వీర హనుమాన్ విగ్రహాన్ని మీరూ దర్శించి తరించండి.
**
చేరే మార్గం ఇలా
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో విజయవాడకు 35 కిలోమీటర్ల దూరంలో 9వ నెంబరు జాతీయ రహదారి పక్కన కంచికచర్ల మండలం, పరిటాల గ్రామానికి తూర్పు దిశగా సువిశాల ప్రదేశంలో మనసును దోచే మనోహరమైన 135 అడుగుల ఎతె్తైన శ్రీ దివ్య సుందర అభయ వీరహనుమాన్ విగ్రహం ప్రతిష్టించటం జరిగింది. ఈ వీరహనుమాన్ ను చూడడానికి అనేక విజయవాడ దాకా ఎక్కడనుంచైనా రైలు,బస్సుల ద్వారా వచ్చిఅక్కడనుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ఈ గ్రామానికి చేరుకోవచ్చు.

-కాకరపర్తి సుబ్రహ్మణ్యం