పర్యాటకం

పొడగంటిమయ్యా నిన్ను...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని గూర్చి పలువురు పలుతీరుల చెప్తుంటారు. ఉన్నది ఒకడే దైవం అయనా జిహ్వకోరుచి అన్నట్టుగా ఎవరికిష్టమొచ్చిన తీరులో వారు ఆదైవం గురించి చెప్తారు. గుణాతీతుడు, నిరాకారుడు అయన దైవం భక్తుల కోరిక మేరకు వారు కోరుకున్న రూపాల్లో వ్యక్తమవుతుంటాడు. అవ్యక్తుడైన భగవంతునికి రూపాన్ని, నామాన్ని కల్పించుకుని పూజించి తన్మయుడౌతాడు భక్తుడు.
భక్తుడు విగ్రహారాధన చేస్తూ చేస్తూ జ్ఞానమార్జించి రూపులేని భగవంతుని తత్వం ఆకళింపు చేసుకొనేస్థితికి ఎదుగుతాడు కనుక ఋషులు, సాధకులు, పెద్దలు ఎవరైనా సరే భగవంతుని నీవు కోరుకున్న రూపంలో ఆరాధిం చమని సలహా ఇస్తుంటారు.
మరికొంతమందికి భగవంతుడు స్వప్న దర్శనం ఇస్తాడు. తాను విగ్రహరూపంలో ఫలాన చోట ఉన్నానని తనకోసం ఆలయం నిర్మించమని ఆదేశిస్తుంటాడు. భగవానుని ఆదేశం ప్రకారం భక్తులు ఆలయనిర్మాణం కావిస్తుంటారు.
మరికొన్ని చోట్ల విగ్రహ తయారీ చేసి శాస్త్ర పరిశీలనతో విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంటారు. ప్రతిష్ఠించిన విగ్రహాలల్లో కూడా భగవంతుని దర్శించుకొనేవారు ఎందరో ఉన్నారు. కనుకనే ఆలయ మహాత్వాలు మహిమలు స్థలపురాణాల్లో కనిపిస్తాయ.
మరికొన్ని చోట్ల దుష్టశిక్షణార్థం భగవంతుని తన్ను తాను సృజియంచుకుంటాడు. ఆ దుష్టుల దౌష్టాన్ని ఎండగట్టడానికి శిష్టులను, సజ్జనులను రక్షించడానికి తన్ను తాను ఎన్నో రూపాలల్లో సృజియంచుకుంటాడు. అట్లా భగవంతుడు సృజియంచుకున్న రూపాలే అవతారాలు. ఒక సారి హిరణ్యకశపుని నిర్జించడానికితన్ను తాను నృసింహరూపంలో అవతరించుకుంటే మత్య్స, వరాహ రూపాలు కూడా రాక్షస నాశనం కొరకే సృజియంచుకున్నవి.
రాముడు కృష్ణుడు కూడా దుష్టశిక్షణార్థం భగవంతుడు సృజియంచుకున్న మానవ రూపాలు. కలియుగంలో వేంకటేశ్వరుడు కూడా ఆ దైవం సృజించుకున్న రూపే.
కలియుగంలో కేవలం నామస్మరణతో మోక్షాన్ని పొందవచ్చు కనుక తాను అవతార మూర్తియైనా కొన్నాళ్లు సాధారణ మానవ రూపంలో ఉండి అలివేలుమంగమ్మను పెళ్లియాడి తన భక్తుల కోసమే శిలారూపియై భక్తుల కడగండ్లను దూరం చేసి వారిలో భక్తిఅనే బీజాన్ని నాటి తనపై అచంచలమైన నమ్మకాన్ని కలుగజేస్తున్నాడు ఆ దైవం. ఎనె్నన్నో మహిమలు చూపుతున్నాడు. ఒక్క తిరుమలలోనే కాక ప్రపంచంలోని అన్ని నగరాల్లోను, వూర్లల్లోను, వాడవాడలా తన విశ్వరూపాన్ని ప్రదర్శించచేయడానికి అనేక కోవెలల్లో కొలువై భక్తుల మనసును రంజింపచేస్తున్నాడు ఆ వేంకటేశ్వరుడు.
నామమే లేనివాడు అనంతనామధారు డయ్యాడు. రూపమే లేని వాడు అనేక రూపాలున్నవాడుగా పేరుమోసాడు. ఈ వర్ణించ లేని దైవాన్ని గురించి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ భారత భాగతాధిగ్రంథాలు బహు ముఖాల్లో అనేక కోణాల్లో వర్ణిస్తాయ. సామాన్యులు అర్థం చేసుకోవడానికిగాను పెద్దలు, పండితులు వక్త లుగా మారి ఆ భగవంతుని తత్వాన్ని అనేక విధాలుగా చెప్తుంటారు. అట్లా కొలువైన వేంకటేశ్వరుని కోవెల సిక్కోలు వేంకటేశ్వరా లయం. శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతీపేట ప్రాంతంలో కొలువైనారు శ్రీ వేంకటేశ్వర స్వామివారు. నారాయణదాసు మరికొంత మంది బృందం కలిసి వైష్ణవ ప్రతిష్టతను, రామాయణ, భారత, భాగవత పురాణ ప్రవచనాలను ప్రజలకు అందించేవారు. ఈ విధంగారామదాసు బృందం గ్రామ గ్రామాల్లో పర్యటించి ఆధ్యాత్మిక ప్రచారం కొనసాగించే సమయంలో నారాయణదాసు కు శ్రీ వేంకటేశ్వర స్వామివారు కలలో దర్శనమిచ్చినారు. ఆ స్వప్నంలో ‘‘నా సేవ చేసుకో ‘‘ అనే మాటలు ఆయనకు పదే పదే స్వామి మాటలుగా వినిపించాయి.
పైగా కలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి పాదాలు గుట్టల మధ్య తుప్పల్లో ఉన్నట్లు కనిపించాయ. ఇది జరిగిన కొద్ది రోజులకే గుజరాతీపేట ప్రాంతంలో రాళ్లు రప్పలతో ఉన్న ఈ ప్రాంతంలో పొదలమాటున స్వామివారి విగ్రహం దర్శనమిచ్చింది. వెంటనే గురువు గోవిందాచార్యుల ఆదేశానుసారంగా ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి 1950లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నారాయణతిరుమలపై నెలకొన్న ఈ ఆలయ నిర్మాణం రెండు ఎకరాల భూ విస్తీర్ణంలో కొనసాగించారు. ఈ ఆలయంలో 1961లో శ్రీ వెంకటరామానుజ సేవాదళం ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి.
ఇక ఆరోజు నుండి ఈ ఆలయంలో నిత్యపూజలు, విశేష సేవా కార్యక్రమాలుచే జరుగు తున్నాయ. గురుగుబెల్లి నారాయణదాసు బృందం ఆధ్వర్యంలో చిన్న దేవాలయంగా రూపుదిద్దుకున్న వేంకటేశ్వరాలయం నేడు పెద్ద ఆలయంగా నెలకొంది. ఆలయాన్ని ఎప్పటి కప్పుడు పునర్నిర్మాణం చేస్తునారు. ఇపుడు పటిష్టమైన గాలిగోపురం, బేడా మండపాన్ని అధునాతనంగా నిర్మించారు.
రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణంలో గర్భాలయం, ఒకవైపు శ్రీ మహాలక్ష్మి, మరొకవైపు ఆల్వార్ల ఆలయాలు నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశారు. 2004లో ఈ దేవాలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని చినజీయరు స్వామి చేతులు మీదుగా ఆలయ శిఖర ప్రతిష్ఠ, స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.
బేడా మండపంలో దశావతారాలతో కూడిన విగ్రహాలున్నాయ. ఈ దేవాలయానికి ఎదురుగా 40 అడుగుల గరుడాళ్వార్ విగ్రహం, దేవాలయం ప్రక్కన 43 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంకూడా దర్శనం చేసుకోవచ్చు. నాగావళి నదికి పశ్చిమాన ఉన్న గుజరాతీపేటలో ఈ దేవాలయం ఉండడంతో శ్రీకాకుళం పట్టణంలో ఎక్కడ నుండి చూసినా ఈ ఆంజనేయస్వామి అబ్బురపరుస్తాడు.

- ఎ. రాజమల్లమ్మ