పర్యాటకం

నరులను కాచే నారసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రని కన్నులతో, తెల్లని ద్రంష్టములతో, నిక్కబొడుచుకున్న రోమాలతో, వాడియైన గోళ్లతో అన్నిలోకాలను గజగజలాడిస్తూ ఉగ్రత్వంతో అడుగు లేస్తున్న నరసింహుడు వికటాట్ట్టహాసంతో నడచి వస్తుంటే విష్ణువెక్కడ అని రంకెలేస్తూ కొడుకు అనైనా చూడకుండా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి బాధపెడుతుంటే చూడలేక పరుగెత్తుకు వచ్చినట్టుగా వచ్చి స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్యకశ్యపుడు కోరుకున్నట్టుగానే తన అంకంపై పడవేసి నారసింహుడై హిరణ్యుని పొట్టను చీల్చి వేసాడు. సర్వలోకాలు నర సింహునిపై పుష్పవృష్టి కురిపిం చాయ. రాక్షస సంహారం జరిగిందని దేవతలంతా మహా విష్ణువును నార సింహరూపంలో ఎలుగెత్తి కీర్తించారు. భూదేవి తన భారాన్ని తగ్గించావంటూ నారసింహుని స్తుతించింది.
చిరునవ్వుతో చూస్తూ కోపజ్వాలలో మండిపడే నరసింహుని దగ్గరకు ప్రహ్లాదుడు వెళ్లాడు. తన భక్తుని చూసి చూడగానే ఎర్రదనంతో ఉన్న ఆ కనులు కరుణాదృక్కులుగా మారాయ. చేత్తో దగ్గరకు పిలుస్తూ ఇక నీవు ఈ లోకాన్ని పాలిస్తూ ధర్మాన్ని పునః స్థాపితం చేస్తావు కదా అంటున్న నారసింహునికి చేతులెత్తి మొక్కి స్వామి నీ ఉగ్రరూపం దుష్టుల కు భయంకరమై కనిపిస్తుంది. నాలాంటి నీ భక్తులకు నీరూపం అభయ ముద్రయై కని పిస్తోంది అంటూ తన్మయంగా ప్రహ్లాదుడు నరసింహస్వామిని కీర్తించారు.
ఆ హిరణ్యకశ్యపుడే హైదరాబాదుకు దగ్గరలోని యాద్రాదిలో పంచ నార సింహరూపాలల్లో దర్శనమిస్తున్నాడు. యాదఋషి కోరిక మీద నివసించే ఈ యాద్రాది నారసింహుని దర్శనం సర్వ పాపహరంగా చెప్తారు. అంగరంగ వైభోగంతో తెలంగాణా దేవునిగా స్థిరమై ఉన్న ఈ దేవునివైభవాన్ని చూడడానికి వేయ కన్నులున్నా చాలవంటారు. వేయనోర్లున్నా వర్ణించడానికి చాలవంటారు. ఆంజనేయుడు క్షేత్రపాలకునిగా ఉన్న ఈ యాదగిరి అన్న ప్రాంతంలో యాదర్షి కోరికపై కొలువైన నిత్యమంగళుడై కీర్తింపబడే నారసింహస్వామిని దర్శించడానికి వేలకొలది మైళ్లదూరం నుంచి కూడా భక్తులు తరలి వస్తుం టారు.
పూర్వకాలంలోఈ స్వామిని కొలవడానికి దివి నుంచి దేవతలు దిగి వచ్చేవారని ఇక్కడి స్థానికులు చెప్తుంటారు. ఇప్పటికీ రాత్రివేళ ఈ దివ్యుల సంచారం జరుగుతోందని భక్తుల విశ్వాసం. దివ్యులు రాత్రివేళ నారసింహుని పూజించిన పూలు, చందనాదుల నైర్మల్యాలను ఇక్కడి వారెందరో చూచినట్లు చెబుతుంటారు ఇప్పటికీ. ఈ నరసింహ స్వామిని కోరి కొలిచినవారికి ఈడేరని కోరికలుండవంటారు. అంతే కాక సంతానార్థులు, అర్థమును కోరే వారు, విద్యను కాంక్షించేవారు ఇలా ఈ ఇలాతలంలో కోరికలే కాక పర లోకంలో నరసింహుని సన్నిధిని వాంఛించి మోక్షమివ్వమని కోరువారి కోరికలను కూడా ఈడేరుస్తాడు ఈ నారసింహుడు.
ఇక్కడికి వచ్చి స్వామిని దర్శిం చుకుని 41రోజులపాటు లేక 21 రోజుల పాటు ఇక్కడే ఉంటూ స్వామిని కొలుస్తారు. ఇట్లా చేయడం వల్ల స్వామి వారు భక్తుల కోర్కెలు త్వరగా తీరుతాయన్న నమ్మకం భక్తులలో మెండు. ఈ యాదగిరి నరసింహుడు సర్వ జనావళికి మోదాన్ని గూర్చే సర్వేశ్వరునిగా దర్శన మిస్తాడు. సర్వాలంకారభూషితుడైన స్వామి చెంత అమ్మ లక్ష్మీనిలిచి ఉంటుంది. స్వామిని దర్శించు కొన్నం దరి ఈతి బాధలను తీర్చడానికే నన్నట్టుగా అమ్మ కరుణార్థ పూరిత కన్నులతో చిరునవ్వుతో భక్తులను వీక్షిస్తుంటుంది. ఈ యాదగిరీశుని దర్శించుకున్న వారికి అనా రోగ్యాలు దూరమవుతాయ. మానసికక్లేశాలు దరి చేరవు. హైదరాబాదుకు అతి సమీపం లోఉన్న ఈ యాదగిరి క్షేత్రానికి చుట్టు పక్కల రాష్ట్రాలనుంచి ఎంతో మంది భక్తులు తండోపతండాలు వచ్చి దర్శిస్తుంటారు. యాదగిరి క్షేత్రదర్శనం సర్వ పాపహరం. సర్వశుభకరం.

- ఎ. రాజమల్లమ్మ