పర్యాటకం

టి.కుంట్లపల్లె దండు మారెమ్మ సత్యప్రమాణాల తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన ధర్మాన్ని ఆచరించే హైందవ జాతి అనాదినుంచి అమ్మ ఆరాధన జరుపుతూనే ఉంది. సర్వసృష్టికి కారణభూతురాలు ఆదిపరాశక్తి అని తలచేవారు ఆ ఆదిపరాశక్తిని తమ గ్రామదేవతలుగా నెలకొల్పుకున్నారు. ఆషాడశ్రావణాల్లో వచ్చే వర్ష ఋతువు కారణంగా పురుగు పుట్రా వల్ల వచ్చే వ్యాధుల బారినుంచి తమను కాపాడమని జనమంతా జగజ్జననిని వేడుకుంటారు.
ఈ జగజ్జనినే ముగ్గురమ్మల మూలపుటమ్మ పార్వతీ దేవి అని వైకుంఠుని ఇల్లాలైన మహాలక్ష్మియని, బ్రహ్మదేవుని ఇల్లాలై సర్వులకు విద్యాదానం చేసే తల్లి సరస్వతి యని కూడా హారతులిస్తారు. ఆ ఆదిపరాశక్తి వాడవాడలా, ప్రతి గ్రామంలోను నాలుగుదారుల కూడలిలోను కొలువైంది. చెరువుకట్లపైనా, సరిహద్దుల్లోను కూడా తన్ను తాను సృజియించుకుంది. వివిధ రూపురేఖలతో అమ్మ ఆసీనురాలై తన బిడ్డల ఆయురారోగ్యాలను, వారి సంపదను కాపాడుతూ ఉంటుంది.
అందుకే ఒక చోట అమ్మకు చద్దిపెట్టి తమను చల్లగా చూడమని వేడుకొంటారు. మరోచోట సాకపెట్టి సల్లగా చూడమని ప్రార్థిస్తారు. అమ్మను యాదేవీ సర్వభూతేషు అన్న స్తుతించినా, ఆ అమ్మనే మొక్కులు తల్లీ మొక్కులు అంటూ మొక్కుకున్నా ఆ తల్లి ఏ రూపంలోనైనా ఉంటూ తన బిడ్డలను కంటికి రెప్పల్లా కాపాడుతుందని అమ్మభక్తుల నమ్మకం.
అనంతపురం జిల్లాలోని తుమ్మల కుంట్లపల్లె అన్న గ్రామం ఒకటి ఉంది. అక్కడ ఆదిపరాశక్తి దండుమారెమ్మగా కొలువైంది. అమ్మ అపార ప్రేమవాహినికి ఎల్లలు లేవు కదా. అందుకే ఆ మారెమ్మ తనను స్మరించినవారికెల్లా తన ఆశీస్సులను అందచేస్తుంది. సుమారు నాలుగువందల సంవత్సరాల చరిత్ర గలిగిన ఈ తుమ్మల కుంట్లపల్లెలో సత్యధారణ చేసిన వారికి వారు అడగకపోయినా తన్ను ప్రార్థించక పోయినా అమ్మ ప్రతి అడుగులోను అండగా నిలుస్తుంది. అందుకే ఈ మారెమ్మ అనుగ్రహం తమపై దండిగా ఉండాలన్న ఆశతో దండు మారెమ్మగా పెట్టి ‘‘పార్వతి తనయా మారెమ్మ.. శక్తి స్వరూపిణి మారెమ్మ ప్రజల ఇలవేల్పు మారెమ్మ.. కొంగు బంగారం మాయమ్మ ...’’అంటూ తల్లిని వేడుకుంటున్నారు ఈ గ్రామస్థులు.
ఒకానొక రోజు ఈ గ్రామస్థులందరికీ ఒకేసారి కలలో కనిపించి ‘‘శిశువుల్లారా! మీరందరూ నా బిడ్డలు. మిమ్ము కలరా, మశూచి, అంటూ ఏ వ్యాధులు దరిచేరనివ్వను. మీ యోగక్షేమాలను నేను చూసుకుంటాను.అందుకే నేనిక్కడ కొలువై ఉండాలని వచ్చాను నాకోసం ఓ ఆలయాన్ని నిర్మాణం చేయండి ’’ అంటూ ఆదేశించిందట. ఇలా అమ్మ అనుగ్రహం అందరిపైనా ఉందని ఈ అమ్మను దండుమారెమ్మగా వీరు సంభావించి పూజించారు.
దండోరాతో ప్రచారమైన ఈ మారెమ్మ మహాత్మ్యం కనుక ఈ మారెమ్మను దండు మారెమ్మగా కూడా పిలుస్తుంటారు. అమ్మ అనుగ్రహం, ఆదేశంతో ఈ ఊరిలోనే శివాలయ నిర్మాణం కావించారు. రామాలయ నిర్మాణాన్ని కూడా చేపట్టారు.
బ్రిటీషుకాలంలో ఎన్నో గ్రామాలు, ఎన్నో పల్లెలు మశూచి, కలరా వంటి వ్యాధుల బారిన పడి అకాల మృత్యువాత పడినా ఈ కుంట్లపల్లెవాసులు మాత్రం దండుమారెమ్మనీడలో చల్లగా జీవించారు. ఈ సంగతి ఆనోట ఈనోట పాకి పక్కగ్రామాలకు దండు మారెమ్మ మహాత్మ్యం అందరికీ తెలసి అందరూ అమ్మను సేవిస్తున్నారు. అమ్మ కోరిన వారి కోర్కెలు తీర్చే తల్లిగానే కాక ఎవరైతే సత్యధారణ చేస్తారో వారికి తోడునీడగా ఉంటానని చెప్పిందని అందరూ సత్యాచరణులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు.్ప ఈ తల్లిని కొలిచేవారికి కొంగుబంగారంగా దండు మారెమ్మ ప్రసిద్ధి చెందింది. భవిష్యత్తులో ఈ మారెమ్మ ఆలయం సత్యప్రమాణాలకు నిలయం అవుతుందని ఈతల్లి వాక్కు ఇచ్చిందని ఇక్కడి గ్రామస్తులు చెబుతారు. తల్లి దగ్గరకు ఏ అసత్యవాదులు వచ్చినా వారికి తల్లి అనుగ్రహం లభించదు. కేవలం సత్యధారణులకు మాత్ర మే తల్లి అంటదండా ఉంటుంద నేనది మారెమ్మ భక్తుల నమ్మకం.

- జి. కల్యాణి