పర్యాటకం

కల్మషహరుడు వేణుగోపాలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం
మధురం మధురాధిపతే రఖిలం మధురం
అంటూ శ్రీకృష్ణుని కృష్ణాష్టమినాడు సర్వులూ పూజిస్తారు. కృష్ణ దేవాలయాలన్నీ కృష్ణ జనన మహోత్సవాలతో కిటకిటలాడుతుంటాయి. ఎవరి నోట చూచినా కృష్ణానామామృతం జాలువారుతూ ఉంటుంది. ఆబాలాగోపాలాన్ని అలరించే కృష్ణ జననం కృష్ణ చరితంలో ఏ భాగాన్ని ముట్టినా అది నవరసాలూరే కావ్యంగా రూపొందుతుంది. అట్టి కృష్ణుని జీవితంలోని రసరమ్యఘట్టాలను ప్రతి కృష్ణాలయం కృష్ణాష్టమి సందర్భంగా నెమరేసుకుంటుంది. అటువంటి దేవాలయాల్లో హంసల దీవి వద్ద వున్న శ్రీవేణుగోపాల స్వామి దేవాలయం ఒకటి. వాడ వాడనా వెలసి ఉన్న కృష్ణాలయాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ హంసల దీవి వద్ద నున్న దేవాలయం మరో ఎత్తు. ఈ స్వామి పిలిస్తే పలికే దేవునిగా కీర్తించబడుతున్నాడు.
కృష్ణుడు ముల్లోకాల వాసులను కంస సంహారం చేసి ఆనంద తన్మయులను చేశాడు. తల్లిదండ్రులను కారాగారావిముక్తి కలిగేట్లుగా చేశాడు. నరకుని దగ్గర ఉన్న కన్యలందరికీ విముక్తినిచ్చాడు. కంసుని దగ్గర బంధీలుగా ఉన్న అనేకమంది రాజులను బంధవిముక్తులను చేశాడు. ఓసారి ఆ స్వామికి కలియుగానికి రావలన్న కోర్కె జనించిందట.
కలియుగంలో పాపాత్ములందరూ గంగలో స్నానంచేసి తమ కల్మషాలను పోగొట్టుకుంటున్నారు. కాని వారి వారి పాప ఫలితాన్ని మోస్తున్న గంగ నల్లగా మారింది. దానితో ఆమె విష్ణుమూర్తిని ప్రార్థించి తన్ను కాలుష్య రహితం చేయమని వేడుకుంది. విష్ణుమూర్తి ‘గంగా! లోకుల కల్మషంను గ్రహించి నీవు నల్లగా మారిపోయావు. కనుక నల్లని కాకిరూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ వుండు. ఏ తీర్థంలో స్నానమాచరించి నీ మాలిన్యం వదలి హంసగా మారతావో అది దివ్య పుణ్యక్షేత్రం అవుతుంది. అక్కడ నేను కృష్ణుని రూపంలో వెలుస్తాను. అని ఆమెకు వరం ఇచ్చాడు. ఆనాటి నుంచి కాకి రూపంలో గంగ ప్రతీ నదీ లోనూ స్నానం ఆచరిస్తూంది. చివరకు ఈ పుణ్యకృష్ణ దివిసీమలో స్నానం ఆచరించగానే హంసగా మారింది. అప్పటినుంచి ఈ గ్రామానికి ‘హంసలదీవి’ క్షేత్రంగా పేరు వచ్చిందని పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది
శ్రీ వేణుగోపాలస్వామి ఉద్భవం
గంగకు ఇచ్చిన మాట ప్రకారం స్వామి కృష్ణావతారుడై ఇక్కడున్న అరణ్యంలో పుట్టలో వేంచేసాడు. ఆ సంగతి తెలుసుకొన్న ఆవులు మేతకు వచ్చినప్పుడు పాలను ధారగా స్వామికి అర్పించేవి. ఇంటికి వెళ్లి గోవుల యజమానులకు పాలిచ్చేవికావు. దీంతో వారు పశువుల కాపర్లను నిందించారు. తమ తప్పు వలనే గోవుల పాలు వట్టి పోయాయన్న నిందను పోగొట్టుకోవడానికి గోవుల ను ఏం చేస్తాయో చూడాలిన ఓ రోజు కాపర్లు ఆవుల వెంటనంటి వెళ్లారు. అవి వెళ్ళి పుట్టలో పాలను స్రవించడం చూసారు. ఆ పుట్టలో ఎవరున్నారో చూడాలని కాపర్లు పుట్టను పగుల కొట్టారు. కాని వారికి అక్కడ ఏమీ కనిపించలేదు. అప్పటినుంచి గోవులు పాలను ఇవ్వడం మానేశాయి. దీనికి కారణం గోపాలుడే అనుకొని ఆ స్వామిని పరిపరివిధాల తప్పు క్షమించమని వేడుకొన్నారు. స్వామి ప్రశాంత చిత్తంతో ఒకరికి స్వప్నంలో కనిపించి ఇలా చెప్పారు- ‘ఓరుూ! పశ్చిమ గోదావరి జిల్లా కాకరమర్తి గ్రామంలో ఒక భూస్వామి ఇంటి ఈశాన్యంలోని కాకరచెట్టు క్రింద నేను వున్నాను. నన్ను తీసుకువచ్చి ప్రతిష్ఠించండి నేను మిమ్ము కాపాడుతాను’ అని వేణుగోపాలుడు ఆనతి ఇచ్చాడు. ఆ విషయం వూరి వారికందరికీ చెప్పారు. వారందరు కలసి చర్చించారు. ఆ తర్వాత గ్రామంలోని కొందరు పెద్దలు స్వామి చెప్పిన ప్రదేశాన్ని గుర్తించారు. ఆ గృహస్థుని కలుసుకొని స్వామి కలలో చెప్పినదంతా చెప్పి ఆ ఇంటి ఈశాన్య భాగంలో కాకరపాదు కింద త్రవ్వారు. అందులో స్వామి విగ్రహం వారికి లభించింది. దానిని తీసుకువచ్చి హంసలదీవిలో ప్రతిష్ఠించారు. అక్కడ లభించిన శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం నీల మేఘ్ఛాయలో ఉండి నల్ల శాసనపు రాయితో చెక్కిన విగ్రహం మాదిరిగా వుంది. ఇది ఈ విగ్రహం విశిష్టత. ఈ స్వామి కోరిన కోరికలు తీరుస్తాడని కృష్ణాష్టమి రోజు, కంస సంహారం రోజు అని అలా ప్రతి పండుగ పర్వానికి కృష్ణునికి వివిధ ఉపచారాలు సేవలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ నవమినుంచి బహుళ పాడ్యమివరకు శోభాయమానంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ కృష్ణస్వామికి దేవాలయ నిర్మాణం కావించారు. ఈ దేవాలయ కుడ్యాల మీద చిత్తరువులను చూస్తే పాండ్య-చోళరాజులు కాలంనాటి శిల్పకళకు సాక్షాలుగా నిలుస్తాయ. రుక్మిణి సత్యభామలను కూడా తీసుకొచ్చి స్వామి పక్కన ప్రతిష్టించి ఇద్దరికీ కల్యాణోత్సవాలను జరుపుతుంటారు. రుక్మిణీ సత్యభామా అమ్మవార్లలకు లక్ష కుంకుమార్చనలు, కుంకుమ పూజలు కూడా చేస్తుంటారు. స్వామి అమ్మవార్లకు జరిపే తెప్పోత్సవాన్ని చూడడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా జనం తండోపతండాలుగా వస్తుంటారు.

- వి. ఎస్. సాయకృష్ణ