పర్యాటకం

తోటపల్లి వేంకటేశ్వరుడు ఆపదమొక్కులవాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క లియుగ వేంకటేశ్వరుడు పలిస్తే పలికే దైవం. ఆయన్ను కొలిచేవారికి తీరని కోరిక ఉండదు. పైగా ఆయన్ను ఎక్కడ చూడాలని వాంఛిస్తారో అక్కడికి ఆ దేవదేవుడే తరలి వస్తాడన్న ఖ్యాతి కలిగిఉన్న పరమాత్మగా కీర్తించబడుతాడు కూడా. అటువంటి ఆ వేంకటేశ్వరుడే నేడిక్కడ పవిత్రమైన నాగావళి నదీ తీరాన కొలువైయున్న తోటపల్లికి వేంచేసాడు. ఈ క్షేత్రంలోని వేంకటేశ్వర స్వామికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ వెంకన్న తో పాటుగా రామన్న గూడా వచ్చి కొలువై కూర్చున్నాడిక్కడ. వీరిద్దరినీ దర్శించ డానికి ఎక్కడెక్కడినుంచో జనం తండోప తండాలుగా వస్తారు.
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన విజయనగరం జిల్లాలోని తోటపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంకేవలం ఆధ్యాత్మిక వాసులకే కాదు పర్యాటక స్థలంగా కూడా రూపొందుతోంది.
ఈ ఆలయం నిర్మాణం వెనుక ఓ ఆసక్తిదాయకమైన కథ ప్రచారంలో ఉంది. 1969వ సంవత్సరంలో తోటపల్లి వద్ద ఒక బస్సు ప్రమాదం జరిగింది. తోటపల్లి గ్రామస్థులు బస్సును వెలికితీసే ప్రయత్నం చేస్తుండగా రెండున్నర అడుగుల ఎత్తుగల వేంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. ఆ విగ్రహానికి విశేష పూజలు చేసి, తాత్కాలికంగా కలపతో ఏర్పాటు చేసిన పందిరి కింద విగ్రహాన్ని ప్రతిష్ఠించారాక్కడ. తర్వాత భక్తులు రావడం స్వామిని దర్శించడం వడ్డీకాసుల వానిగా గుర్తించి ఆపద మొక్కుల వాడని మొక్కి తన మొక్కులు తీర్చినందుకు స్వామివారికి కానుకలు ఇవ్వడం ఆరంభించాడు. ఆ కానుకల విలువ పెరిగి పెరిగి దేవాలయనిర్మాణానికి అంకురార్పణ జరిగిందని ఇక్కడి వారు చెబుతుంటారు.
అదేకాక ఆలయ నిర్మాణానికి తోటపల్లి మునసబు మార్కొండ అప్పలస్వామి నాయుడు మూడు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మూడేళ్ల పాటు ఆలయ నిర్మాణం సాగింది. తర్వాత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తుల సంఖ్య పెరగడంతో 34 గదులతో సత్రం, ఆరు కాటేజీలు, ఒక కార్యాలయం, కల్యాణం కోసం ఓ ప్రత్యేక భవనం నిర్మాణాలు జరిగాయ.
పార్వతీపట్టణం నుంచి శ్రీకాకుళం పోవు ఆర్ అండ్ బి మార్గంలో పార్వతీపట్టణానికి 12 కిలో మీటర్ల దూరంలో తోటపల్లి అనే గ్రామం వద్ద ఈ ఆలయం వెలసింది.
ముఖ్య ఉత్సవాలు
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రతీ ఏటా శ్రావణ బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమి, శ్రావణ శుద్ధ ఏకాదశి నుంచి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు సహస్ర కుంకుమార్చన, ఆశ్వీయుజ శుద్ధ దశమి నుంచి త్రయోదశి వరకు పవిత్రోత్సవాలు, కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు లక్ష తులసి అర్చన, మార్గశిర పుష్య మాసంలో ధనుర్మాసోత్సవం, మాఘశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు వార్షిక కల్యాణ మహోత్సవం, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు డోలోత్సవం అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతాయి.
అలాగే ఇక్కడే కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కూడా విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వసంత నవరాత్రి మహోత్సవాలు, వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు వార్షిక కల్యాణ మహోత్సవాలు శ్రావణ బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమి, ఆశీయుజ శుద్ధ దశమి నుంచి త్రయోదశి వరకు పవిత్రోత్సవాలు, ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శన మహోత్సవాలు నిర్వహిస్తుంటారు.

- ఎస్. నాగలక్ష్మి