పర్యాటకం

మాట తప్పిన చోటే వెలసిన శ్రీరంగం శ్రీరంగనాథస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చె న్నైలో అతి పెద్ద ఆలయం తిరుచునాపల్లి ఆలయం. ఈ ఆలయవైశిష్ట్యాన్ని గురించి ఇక్కడి స్థలపురాణాలు, చారిత్రికాధారాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఈ ఆలయం సుమారు 10వేల అడుగుల పొడవులోను, 60 వేల అడుగుల వెడల్పుతోను ఉందా అనిపిస్తుంది. సుమారుగా ఈ గుడి 156 ఏకరాలుండవచ్చుని ఇక్కడివారు చెప్తారు.
ఆ ఆలయం ఏడు ప్రాకారాలతో ఉంటుంది. ఈ ఏడుప్రాకారాలు దాటి వెళ్లితే అక్కడ గర్భగుడి లో స్వామి మహావిష్ణువు అవతారమూర్తియైన శ్రీరంగనాథ స్వామి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈ ప్రాకారాల్లో సుమారుగా 21 గోపురాలు అత్యంత సుందరంగా కట్టబడి చూపరులను ఆకట్టుకొంటాయి.
ఈ గోపురాల నిర్మాణం భారతీయ శిల్పసంపదకు ఆలవాలంగా కనిపిస్తుంది. ఈ శ్రీరంగ పట్నానికి దగ్గరలో రాక్‌ఫోర్ట్ దేవాలయం, తిరువానై కోవిల్, వెక్కలి అమ్మన్ అనే ఆలయాలు కూడా సుప్రస్ద్ధిమైనవే. ఈ రంగనాథుని దేవాలయం సమీపంలోనే అళగియ నంబి దేవాలయం చాలాప్రసిద్ధిచెంది ఉంది. ఈ దేవాలయం మహావిష్ణువు కొలువై ఉన్న 108 దివ్యదేశాల్లో ప్రముఖమైనదిగా చెప్తారు.
స్థలపురాణం: ఈ ఆలయ విశేషాలను తివియ పిరబంధం అనే తమిళప్రబంధంలోవివరించి ఉన్నారు. ఈ స్వామి దక్షిణాభిముఖుడై దర్శనమివ్వడానికి పూర్వమొక కథ కారణంగా చెప్తున్నారు. రావణుని తమ్ముడు విభీషణుడు మహావిష్ణ్భుకుడు. ఇతడు ఒకసారి తన తపస్సుతో మహావిష్ణువు ను మెప్పించాడు. తపస్సు కు మెచ్చి ఏదైనా వరం కోరుమని మహావిష్ణువు విభీషణుడిని అడిగితే నీవు నాతోపాటు నా నగరానికి వచ్చి అక్కడ కొలువై ఉండాలని విభీషుడు తన కోరికను తెలిపాడట. దానికి మహావిష్ణువు ఒప్పుకున్నాడు. కాని ఒక షరత్తు పెట్టాడు. ‘నీతో పాటు నేను నీ వెనకనే వస్తాను. కాని నీవు ముందు నడుస్తూ ఉండు. నేను నీ వెనక ఉంటాను. కాని నీవు వెనుతిరిగి చూడవద్దు. ఒకవేళ అలా చూస్తే నేను అక్కడ ఉండిపోతాను. ఇది నీ కిష్టమైతే నీతో కూడా వస్తాను ’అని చెప్పాడట. దానికి విభీషణుడు ఒప్పుకున్నాడు.
భక్తుని వెంట భగవంతుడు వెళ్లుతున్నాడు. కొద్దిదూరం వెళ్లేసరికి భక్తుని మనసులో భగవంతుడు నాతో కూడా వస్తున్నాడా లేదా అన్న సందేహం వచ్చింది. భగవంతుని షరత్తు గుర్తుకువచ్చి తన మనస్సును నిగ్రహించుకుని కొద్దిదూరం వెళ్లాడట. కాని, ఇపుడు దేవాలయం ఉన్న ప్రదేశానికి రాగానే ఇక ఉండబట్టలేక విభీషణుడు వెనుదిరిగి చూచాడట. అంతే స్వామి అక్కడే నిలబడి పోయాడు. విభీషణా నీవు షరత్తును ఉల్లంఘించావు కనుక నేను ఇక్కడ ఉండిపోతున్నాను అని అన్నాడట. ఇక భగవంతుని వాక్కుకు తిరుగేముంది. అందుకే ఇక్కడ స్వామి దక్షిణాముఖుడై ఉన్నాడని కథనం. ఈ స్వామి దక్షిణాముఖుడై ఉండడానికి మరోకథనం కూడా ప్రచారంలో ఉంది. ఓధర్మవర్మ అను భక్తుడు మహావిష్ణువు చిత్తరువు గీచి లంకాపట్టణానికి వెళ్లి అక్కడ ఈ చిత్తరువు సహాయంతో స్వామి అర్చామూర్తిని చేయాలని తలంచి బయలుదేరాడట. ఇప్పుడు స్వామి కొలువై ఉన్న చోటుకు వచ్చి, ఈ ప్రదేశం చాలా బాగుంది. ఇక్కడ కాసేపు విశ్రమిద్దాం అనుకొని చిత్తరువును నేలపై పెట్టి ఆయన ఒక కునుకు తీశాడట. ఆ తరువాత లేచి లంకా ప్రయాణమై చిత్తరువు చేతబట్టుకుందామని తీస్తే ఆ చిత్తరువు రాలేదట. ఆ ధర్మవర్మ ఇదేమి చిత్రం అని భగవంతుడిని ప్రార్థించగా రాబోయే కాలంలో ఇక్కడ ఒక గొప్ప దేవాలయం నిర్మించబడుతుంది. అపుడు నీ చిత్తరువు లోని రూపంతోనే స్వామి కొలువై ఉంటాడని ఆకాశవాణి పలికిందట. ఆ మాటలు విని ధర్మవర్మ ఎంతో సంతోషంతో వెళ్లిపోయాడట. ఈ దేవాలయంలోనే అండాళ్ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఈ తల్లి తిరుప్పావై ను పురస్కరించుకొని ఆ తిరుప్పావై పాశురాలను పాడుతూ ధనుర్మాసంలో అండాల్ అమ్మ ఉత్సవాలు ఘనంగా చేస్తుంటారు. ఏకాదశి, పౌర్ణమి తిథుల్లోను విశేష ఉత్సవాలను చేస్తారు.

-జె శ్యామసుందరి 837 489 4741