పర్యాటకం

శరణం అయ్యప్పా ముక్తికి సోపానమిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క లియుగ దైవం అయ్యప్ప ఆరాధాన రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ధర్మశాస్త అయ్యప్ప గురించి కాస్తో కూస్తో తెలియని వారుండరు. వయస్సు తారతమ్యంలేకుండా అయ్యప్పమాలాధారణ పట్ల అందరూ మక్కువ చూపడం నేటి కాలంలో ఆశ్చర్యానందాలు కలిగిస్తున్నాయ.
కార్తీక మాసం ప్రారంభంనుంచి జాతీ, కుల, మత, బాషా బేధాలు లేకుండా సర్వే సర్వత్ర స్వాములు నల్లవస్త్రాలు ధరించి మాలాధారులై, నుదుట విభూతి, చందన, కుంకుమ రేఖలతో దర్శనమిస్తారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ ఎలుగెత్తి ఆ స్వామి నామాలు ఉచ్చరిస్తూ స్వామి పూజలను, భజనలను భక్తి పారవశ్యంతో కలిసికట్టుగా చేసే ఈ ఆరాధన దినదిన ప్రవర్థమానవౌతోంది. కామారెడ్డి జిల్లాలో అయ్యప్పస్వామి మాలాధారణ విషయంలో యువకులు చాలా మంది ఆకర్షితులైన అయ్యప్ప దీక్షలు చేపడ్తున్నారు. డాక్టర్. చంద్రవౌళి గురుస్వామి కథనం ప్రకారం అయ్యిప్ప వ్రతదీక్ష విధానం, పద్దతులు ఏకత్వంలో భిన్నత్వాన్ని కనబరుస్తాయ.
క్రీ.శ.10వ శతాబ్దంలో తమిళభాషలో రచించబడిన పింగళ నిఘంటులోని అర్థాలను చూస్తే హరిహరపుత్రన్, అయ్యన్, అర్యన్, పూరణైకళ్వన్, పుట్కళైమణాళన్, అరతె్తైక్కాప్పోన్, శాతవాహన్, కోయికొడియోన్, శాత్తన్, వెల్లైయానైవాహనన్, కారి, చెండాయుధన్, యోగి, కడల్‌నిరవణ్ణన్ అనుపలు నామాలు అయ్యప్ప అన్న నామానికి ఉన్న అర్థాలుగా కనిపించినా మణికంఠుడు, పందళరాజకుమారుడు అని అయ్యప్పను పిలుస్తుండడమూ ఆచారమే.
బ్రహ్మండపురాణం, స్కంద పురాణాల్లో ధర్మశాస్తా గురించిన వివరాలు కనిపిస్తాయ. క్రీ.శ.1081 తర్వాత కొందరు పాండ్యరాజుల వళ్లియూర్‌లో, తెన్‌కాశీలో సామంతరాజులుగా ఉన్నకాలంలోవీరి పూర్వీకులు చందన రాజకుటుంబీకులు ఆనాటి కేరళ దేశానికి వలస వెళ్లి పందళ రాజ్యాన్ని స్థాపించారని చారిత్రిక కథనం. పందళరాజుకు పిల్లలు లేరని వాపోయేకాలంలో అడవిలో మణిహారముతో అయ్యప్పస్వామి శిశురూపంలో దొరికినట్లుచెప్తారు.
ఆ శిశువును తీసుకొని మణికంఠునిగా పేరుపెట్టుకొని అల్లారుముద్దుగా పందళరాజు పెంచుకున్నారని స్వామి అయ్యప్పచరిత్ర చెబు తుంది. కాని పందళరాజు భార్య మణికంఠుని తల్లిగా మారింది. కాని సవతి తల్లి ప్రేమనే మణికంఠునిపై చూపేది. ఓరోజు ఆ తల్లికి శిరోభారం వచ్చిందని చెప్పి మణికంఠుని పులిపాలకోసం అడవికి పంపింది.
అడవికి వెళ్లిన మణికంఠుడు పులిపై ఎక్కివచ్చి పులిపాలను తెచ్చి సాటిలేని పరాక్రమాన్ని ఆ తల్లికే కాక ఆ రాజ్యానికంతకూ తెలియచేసినట్లు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.
కొన్నాళ్ల తరువాత మణికంఠుడు తాను వచ్చిన కార్యం ముగిసిందని తన పెంపుడు తండ్రితో చెప్పి, అందరు చూస్తుండగానే జ్యోతి పుంజముగా మారి శబరిమాలై కొండల్లో కుంగిపోయేవాడు.
జ్యోతిపుంజముగా మారే ముందు తన తండ్రి కోరికను మన్నించి ప్రతి మకర సంక్రాంతి నాడు తాను జ్యోతిరూపంగా దర్శనమిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఇప్పటికీ మకర సంక్రాంతి నాడు జ్యోతి స్వరూపంగా స్వామి అయ్యప్ప దర్శనమిస్తాడు.
1949సంవత్సరంలో కొన్ని దుష్టశక్తులు నిరీశ్వరవాదులు వలన శమరిమాలైలోని అయ్యప్పదేవాలయం విగ్రహం పగుల గొట్టిబడి తిరిగి ప్రతిష్టంచబడినట్లు, 1951లో ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు కేరళ చరిత్ర స్పష్టం చేస్తుంది. పిటి.రాజన్ అనే తమిళనాడుకు చెందిన భక్తుడు పంచలోహముతో శ్రీ అయ్యప్పస్వామి వారి విగ్రహాన్ని తయారు చేయించి తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో వూరేగించి పలు మహానీయులచే పూజలు చేయించి, శబరిమలకు తీసుకుని వచ్చి అప్పటి శబరిమల ప్రధాన తంత్రిగారిచే కేరళ ఆచారం ప్రకారం జీవోద్వాసన చేసి ప్రతిష్టించారు. ప్రస్తుతం శబరిమల అయ్యప్పసన్నిధానంలో శాస్తావారి విగ్రహాన్ని పిటి.రాజన్ చేసిన దానే్న భక్తులు దర్శించుకుంటారు.
అయ్యప్పస్వామి మాలను జీవితంలో ఒక్కసారి అయినా ధరిస్తే చాలు అనేకానేక వ్యసనాలకు బానిసఅయన వారు ధర్మపరాయణులౌతారని భక్తుల విశ్వాసం. మాలధారణలోని నియమాలు వారిని వినయవిధేయతలు గల సంస్కార వంతులను చేస్తుందని గురుస్వాములు చెబుతారు.
41దినముల కఠిన కఠోర దీక్షను బూనినవారు స్వామి అన్న నామంతోను, మెడలో మాలాధారణ తో అపర అయ్యప్పలాగా దర్శనం ఇస్తారు.
మాలధారణ చేసినవారు నిరంతరం స్వామి శరణుఘోషతో పులకించిపోతుంటారు. పొద్దున్న సాయంత్రం వేళల్లో స్వామికి నీరాజనాలు అర్పిస్తూ అష్టోత్తర శతనామావళులతో స్వామి పూజ చేయడం తమ విధిగా తలుస్తారు. మాలధారణలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు.
మాలధారణలోని ఆచరించాల్సిన నియమాలన్నీ కూడా స్వామి వారి తండ్రిగారైన పందళరాజు రాజశేఖరునికి చెప్పిన నియమనిబంధనలని కేరళ పురణాలు చెబుతున్నాయ.
అయ్యప్పస్వామి వారు తన దీక్ష బూనిన స్వాములకు శనేశ్వరుని కరుణ కూడా లభిస్తుందం టారు. శనేశ్వరునికి ఫ్రీతిపాత్రమైన నల్లవస్త్రాలు నా భక్తులు ధరిస్తారు. వారిని నీవు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దు అని స్వామి అయ్యప్ప శనేశ్వరునికి చెప్పినట్లు కూడా పురాణాలు చెబుతున్నాయ.
దీక్షపూర్తిచేసుకొన్నభక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమాలై యాత్రకు బయలుదేరుతారు. ఉదయానే్న ఇంటివద్ద కొబ్బరికాయను కొట్టి భారమంతా స్వామిపై వేసి తీర్థయాత్రలకు బయలుదేరుతారు. శబరిమాలై చేరుకునే ముందు స్వాములు కేరళలోని ఎరుమేళిలో ఆగి అక్కడ రంగులు పులుముకుని పెటైతుళ్లి ఆడాల్సి ఉంటుంది. రంగులు పులుముకున్న శరీరంతోనే ఎరుమెళిలో ఉన్న అయ్యప్పస్వామి మిత్రుడైన వావర్‌స్వామి మసీదుకు వెళ్లి అక్కడ విభూతి పెట్టుకుని పంబానదికి చేరుకుంటారు. సాయంకాలం పెద్దపాదం నడక ప్రారంభించి మరుసటిరోజు పంపానదికి చేరుకుంటారు. పంపానదిలో స్నానం ఆచరించి అక్కడి నుండి దాదాపు 8కిలోమీటర్ల చిన్నపాదం కొండ ఎక్కుతూ స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. మార్గం మధ్యలోశరణ్‌గుత్తివద్ద కనె్నస్వాములు తమ వెంట తెచ్చిన బాణాలు గుచ్చుతుంటారు. శబరిమాలకు చేరిన తరువాత 18బంగారు మెట్లనుండి స్వామివారి బంగారు కోవేలకు చేరుకుని అయ్యప్పను దర్శించుకుంటారు.
మాలధారణ చేసిన వారి కుటుంబంలో ఊహించని విధంగా అభివృద్ది కన్పిస్తుందని భక్తుల విశ్వాసం. అయ్యప్పస్వామి వారికి కనె్నస్వాములంటే మహాఇష్టమని కేరళ పూజారులు చెబుతుంటారు. శబరిమలైకి ఎప్పుడైతే కనె్నస్వాములు రారో అప్పుడు మాళిగైపురొత్తమ్మను వివాహం చేసుకుంటానని అయ్యప్పస్వామి మాళిగై పురొత్తమకు మాట ఇచ్చినట్లు చరిత్ర చెబుతుంది. అయ్యప్పస్వామి మాలాధారణ చేసిన వారిలో మొదటి సారి మాలాధారణ చేసిన వారిని కనె్నస్వాములుగా, రెండవసారి మాలాధారణ చేసినవారిని కత్తిస్వామి, మూడవసారి మాలాధారణ చేసిన వారిని గంటస్వాములు, నాల్గవసారి మాలాధారణ చేసిన వారిని గదస్వాములు, ఐదవసారి మాలాధారణ చేసిన వారిని పెరుస్వాములు, ఆరవసారి దీక్షమాల వేసినవారిని గురుస్వాములు అని సంబోదిస్తుంటారు. 18వసారి దీక్షనుచేపట్టి శబరిమలైకి పోయే స్వాములు విధిగా కొబ్బరిచెట్టుమొక్కను వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది. 18వసారి శబరియాత్రకు వెళ్లివచ్చిన గురుస్వామి తిరిగి కనె్నస్వామిగా మారిపోతారు. 18వసారి వెళ్లి తిరిగి వచ్చి మరో 11నెలల తరువాత మళ్లీ మాలాధారణ చేస్తే కనె్నస్వామిగా పిలవబడతారు.

- వుక్కల్‌కర్ రాజేందర్‌నాథ్